బ్రేకింగ్: రియా చక్రవర్తికి మరోసారి షాకిచ్చిన కోర్టు.. తప్పనిసరి పరిస్థితుల్లో బైకుల్లా జైలులోనే
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు కఠిన నిర్ణయం తీసుకొన్నది. ఈ కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ కేసులో సుశాంత్ సింగ్ లవర్ రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Recommended Video

డ్రగ్స్ కేసులో 20 మందికిపైగా అరెస్ట్
డ్రగ్స్ రాకెట్ కేసులో దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాదాపు 20 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సిబ్బంది శ్యామ్యూల్ మిరాండా తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా సెప్టెంబర్ 11వ తేదీన కోర్టు నిరాకరించింది.

మరోసారి కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కతి
ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉంటున్న రియా చక్రవర్తి, మరో జైలులో ఉంటున్న షోవిక్ చక్రవర్తి తరఫున వారి తరఫు న్యాయవాది సతీష్ మాన్‌షిండే మరోసారి బెయిల్ పిటిషన్ కోర్టు ముందు దాఖలు చేశారు. అయితే ఎన్సీబీ అధికారులు బెయిల్ ఇవ్వద్దంటూ అడ్డుకోవడంతో ఎన్డీపీఎస్ మరోసారి తిరస్కరించింది. దాంతో అక్టోబర్ 20వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో రియా, షోవిక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

నలుగురి తరఫున లాయర్ల వాదనలు
రియాతోపాటు మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సమయంలో ఎన్సీబీ తరుఫున ఏఎస్‌జీ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితులకు బెయిల్ ఇవ్వ కూడదని బలంగా వాదనలు వినిపించారు. రియా, షోవిక్ తరఫున సతీష్ మాన్‌షిండే, శ్యామూల్ మిరాండా తరఫున సుభోద్ దేశాయ్, దీపేశ్ సవాంత్ తరఫున రాజేశ్ రాథోడ్ వాదనలు వినిపించారు.

రియాను విడుదల చేయాలని స్వరభాస్కర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించిన నేపథ్యంలో రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వాలని బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్, సినీ రచయిత కనికా థిల్లాన్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జైలులో ఉంటున్న రియాను బైకులా జైలు నుంచి విడుదల చేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు.


Click it and Unblock the Notifications











