రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. కోర్టు తీర్పు వాయిదా
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్లపై విచారణ ఉత్కంఠగా మారింది. గత రెండు రోజుల క్రితం రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేయగా గురువారం విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.
డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు, నిషేధిత డ్రగ్స్ సమకూర్చుకోవడం, సరఫరా తదితర ఆరోపణలపై రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెకు మెడికల్ టెస్టులు నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టడగా ఆమెకు 14 రోజులు అంటే రెండు వారాల కస్టడీకి అప్పగించారు. దాంతో రియాను ముంబైలోకి బైకుల్లా జైలుకు తరలించారు. ఆమె సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఎన్సీబీ అధికారులు కస్టడీలో ఉంటారు.

రియా తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సతీష్ మాన్‌షిండే.. తన క్లయింట్ అమాయకురాలు. ఆమె తప్పుడు కేసు బనాయించారు. ఆమె అంగీకారం లేకుండానే నేరాలను బలవంతంగా రుద్దారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆమెను విచారించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో అఫైర్ ఉన్న కాలంలో డ్రగ్స్ కోసం డబ్బులు ఖర్చు చేయలేదని బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
రియా చక్రవర్తిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ), 20(b), 27(a), 28, 29 కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











