రియా చక్రవర్తి అరాచకాలను బయటపెట్టిన మాజీ డ్రైవర్.. ఆ విషయంలో సుశాంత్‌‌‌కు భయం!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌కు గురయ్యారంటూ వస్తున్న ఆరోపణలు ఆయన వ్యక్తిగత సిబ్బంది కొట్టిపడేస్తున్నారు. సుశాంత్ ముఖంలో ఎప్పుడు అలాంటి ఛాయలు కనిపించలేదు అనే ఆయన మాజీ డ్రైవర్ అనిల్ ఆదివాసీ స్పష్టం చేశారు. ఆయన మరణం వెనుక వాస్తవాలను బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే డిప్రెషన్ థియరీలను తెరపైకి తెస్తున్నారు అని పేర్కొన్నారు. తాను పనిచేసిన సమయంలో సుశాంత్‌తో ఉన్న అనుభావాలను రిపబ్లిక్ టీవీతో పంచుకొంటూ..

Recommended Video

Sushant Singh Rajput : Sushant కి చావు అంటే భయం..సూసైడ్ చేసుకునే ఛాన్సే లేదు! - సుశాంత్ మాజీ డ్రైవర్
రియా ప్రవేశించిన తర్వాత

రియా ప్రవేశించిన తర్వాత

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోకి రియా చక్రవర్తి ప్రవేశించిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అప్పటి వరకు సుశాంత్ నియమించుకొన్న ప్రతీ ఒక్కరిని ఆమె తొలగించింది. ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండీ టీమ్ మొత్తాన్ని బయటకు పంపించింది. అప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో సుశాంత్, రియా మధ్య రిలేషన్‌షిప్ లేదనుకొంటాను అని అనిల్ పేర్కొన్నారు.

భారీ లక్ష్యాలతో సుశాంత్‌

భారీ లక్ష్యాలతో సుశాంత్‌

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ జీవితంలో భారీగా ఆశయాలను, లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. చంద్రమండలం పైకి యాత్ర చేయాలనే కల కనేవాడు. ఇలాంటి విషయాలు పక్కవారు విని జీర్ణించుకొలేకపోయేవారు. ఆయన చుట్టు ఉన్నవారు చాలా మిస్టరీగా వ్యవహరించే వారు. తన సిబ్బందిని బాగా చూసుకొనే వారు అని అనిల్ ఆదివాస్ వెల్లడించారు.

సిబ్బందితో చాలా బాగా ఉండేవారు.

సిబ్బందితో చాలా బాగా ఉండేవారు.

సుశాంత్‌తో కలిసి ఓ రోజు షూటింగ్ వెళ్లాను. ఆ రోజు ఆలస్యం కావడంతో నేను కారులో నిద్రమత్తులో జోగుతున్నాను. అప్పుడు నా వద్దకు వచ్చి నిద్ర వస్తుందా అంటే లేదు అని చెప్పాను. ఆయన నా పరిస్థితిని గ్రహించి పర్వాలేదు.. నీవు డ్రైవింగ్ చేయవద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఆయనే డ్రైవ్ చేసుకొంటూ వెళ్లాడు. నేను మరో కారులో వచ్చాను అని ఓ సంఘటనను అనిల్ ఆదివాసి గుర్తు చేసుకొన్నారు.

 చావు అంటే మహా భయం

చావు అంటే మహా భయం

సుశాంత్ సింగ్‌కు మరణం అంటే చాలా భయం. జీవితమంటే ఆయను పంచ ప్రాణాలు. అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకొన్నారని నేను అనుకొను. సుశాంత్ అలాంటి పని చేశాడని నేను నమ్మను. సుశాంత్ మంచి హృదయం ఉన్న మనిషి. అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం పంచుతుండేవారు అని అనిల్ ఆదివాసీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X