సుశాంత్ ప్రమాదంలో ఉన్నాడని రియా ముందే పసిగట్టిందా.. అందుకే బ్లాక్ చేసింది!
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలాంటి పరిస్థితులలో మరణించడో అనే అంశం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తోంది. మృతి పై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. ఎన్నో అనుమానాలు ఉన్నా సరైన సాక్షాధారలు లభించడం లేదు. ఇక ఈ విషయంలో బడా నేతల హస్తం ఉందని కూడా కామెంట్స్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తానికి ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో కొత్త విషయాలు ఏమైనా బయటపడతాయేమో అని అందరు ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడైతే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారో..
సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుంచి కూడా కేసు విషయంలో అనేక రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తోంది ముంబై పోలీసులే. ఇక రీసెంట్ గా సుశాంత్ తండ్రి కేసు నమోదు చేయడంతో బీహార్ పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బీహార్ పోలీసులు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కేసులో కొన్ని కొత్త విషయాలు వెలువడ్డాయి. అనంతరం సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ముంబై పోలీసులపై తీవ్ర స్థాయిలో అనుమానం వ్యక్తం చేశారు.

రియా ప్రమాదాలను ముందే పసిగట్టిందా?
అసలు మ్యాటర్ లోకి వస్తే.. సుశాంత్ కేసు విషయంలో సాక్ష్యాలు తారుమరయ్యాయనే వాదనలు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే విషయంపై బాలీవుడ్ మీడియా అనేక రకాల డిబేట్స్ నిర్వహిస్తోంది. ఇక రీసెంట్ గా ఒక మీడియా ఛానెల్ బ్యాక్ గ్రౌండ్ లో ఇన్వెస్టిగేట్ చేసినదాన్ని బట్టి రియా చక్రవర్తి భవిష్యత్తు ప్రమాదాలను ముందే ఊహించిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

పూర్తిగా దూరం. పెట్టేసిన రియా
ఇక సుశాంత్ మరణానికి ముందు ఆమె అతని నెంబర్ ని బ్లాక్ చేసిందనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సుశాంత్ జూన్ 14నా మరణించగా జూన్ 8 నుంచి రియా పూర్తిగా సుశాంత్ ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కడా కూడా వివాదాలకు సంబంధించిన విషయాలను ఫోన్ లో మాట్లాడకుండా జాగ్రత్త పడిందని కామెంట్స్ వస్తున్నాయి.
Recommended Video

కాల్ రికార్డ్స్.. అదే బిగ్ సస్పెన్స్
రియా భయపడిందా? లేక సుశాంత్ గురించి అన్ని తెలిసే ఆమె కావాలని దూరం పెట్టిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కేసు విషయంలో కీలక ఆధారాలు లభించాలి అంటే ప్రధానంగా ఆమె కాల్ రికార్డ్స్ ని సంపాదించాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు ఆ దారిలో పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు సేకరించారనేది బిగ్ సస్పెన్స్ గా మారింది. ఇక సీబీఐ ఎంట్రీ ద్వారా అయినా కేసులో ఏదైనా కొత్త మార్పు కనిపిస్తుందో. లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











