సుశాంత్‌ను చివరిసారిగా చూసేందుకు వచ్చిన ప్రేయసి.. రియాను ప్రశ్నించిన పోలీసులు

సుశాంత్ సింగ్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాకుండా అన్ని భాషలకు చెందిన సెలెబ్రిటీస్ స్పందిస్తున్నారు. ఇక సుశాంత్ ఆత్మహత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రతిభావంతుడైన నటుడు ఇంత త్వరగా వెళ్లిపోయాడని సెలెబ్రిటీలందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేమికుడు భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన్ను చివరి చూపు చూసేందుకు ప్రేయసి రియా చక్రవర్తి హాస్పిటల్‌కు వచ్చింది.

సుశాంత్ ఆత్మహత్య..

సుశాంత్ ఆత్మహత్య..

గత కొంత కాలంగా డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇక సుశాంత్ ఆత్మహత్యపై బాలీవుడ్ మొత్తం స్పందించింది. అయితే ఆత్మహత్యపై నెటిజన్స్ స్పందిస్తూ నెపోటిజమే కారణమని ఫైర్ అవుతున్నారు.

 పోస్ట్‌మార్టం రిపోర్ట్..

పోస్ట్‌మార్టం రిపోర్ట్..

మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకుపోవడం వలనే సుశాంత్ ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఇది ఆత్మహత్యేనని ప్రాథమికంగా నిర్దారించారు. సుశాంత్ మృతదేహం ప్రస్తుతం జుహులోని కూపర్ ఆసుపత్రిలోనే ఉంది.

చివరిసారిగా చూసేందుకు..

చివరిసారిగా చూసేందుకు..

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి.. చివరిసారిగా చూసేందుకు హాస్పిటల్‌కు వచ్చింది. ఆమె ఆస్పత్రిలో అవరణలో కనిపించగా కెమెరాలకు చిక్కింది. అయితే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

భయపడిన రియా..

భయపడిన రియా..

సుశాంత్, రియాలు గత కొంతకాలం నుంచి వేరుగానే ఉంటున్నారు. సుశాంత్ డిప్రెషన్‌కు సంబంధించిన వైద్యం తీసుకుంటుండగా.. మధ్యలో మందులు తీసుకోలేదని, ఎప్పుడూ ఆందోళనకు లోనవుతుండే వాడని తెలుస్తోంది. సుశాంత్ ప్రవర్తన భయం కలగడంతో రియా దూరంగా ఉందట. అయితే సుశాంత్‌కు సోదరి ఎంతో నచ్చజెప్పిందట.. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందట.

Recommended Video

Director SS Rajamouli Launched The Telugu Logo Of 'Brahmastra' | Filmibeat Telugu
ఎందుకు స్పందించడం లేదు..

ఎందుకు స్పందించడం లేదు..

రియా చక్రవర్తి సుశాంత్‌ను చివరి చూపు చూసేందుకు వచ్చిన విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎందుకు స్పందించడం లేదని కొందరు ఆమెను టార్గెట్ చేయగా..సుశాంత్ పోయిన బాధ మనందరి కంటే ఆమెకు ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి సమయంలో ట్వీట్ గానీ సోషల్ మీడియాలో గానీ ఎలా రియాక్ట్ అవుతారని ఇంకొందరు సపోర్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X