వెలుగులోకి సంచలన నిజాలు.. సుశాంత్ ఇంట్లోని 8 హార్డ్ డిస్క్‌ల డేటా మాయం చేసిన రియా!!
సుశాంత్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. మొదట ఆత్మహత్య అన్నారు.. ఆపూ బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఈ కేసు మొత్తం సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి చుట్టుకుంది. సుశాంత్ త్రండి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి రియాపైనే అందరి ఫోకస్ పడింది. సీబీఐకి ఈ కేసును అప్పగించడం, ఈడీ సైతం రియాపై పలు కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిందే. తాజాగా మాదక ద్రవ్యాల వాడుతుండటం, డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలు ఉండటంలో నార్కో డిపార్ట్మెంట్ కూడా రియాపై కేసులు నమోదు కానున్నాయని తెలుస్తోంది. తాజాగా మరో సంచలన నిజం బయటకు వచ్చింది.
Recommended Video

డ్రగ్స్ వాడకం..
రియా చక్రవర్తి డ్రగ్ డీలింగ్‌పై వివరాలు సేకరించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియాకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని తెలియడంతో ఆమెపై కేసు నమోదు చేసి విచారించేందుకు సెంట్రలో బ్యూరో ఆఫ్ నార్మోటిక్ డిపార్ట్మెంట్ రెడీ అయింది. ఇక తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

ఆనాడే ముహూర్తం..
తాజాగా సుశాంత్ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. దిశా సలియాన్ మరణించిన రోజునే సుశాంత్‌ను చంపేందుకు ప్లాన్ రెడీ అయిందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఇదేమీ సాధారణ హత్య కాదని, ఎంతో పక్బంధీగా అమలు చేసి హతమార్చారని డిబెట్లు నిర్వహిస్తున్నారు.

ఐటీ ప్రొఫెషనల్స్ చేత..
దిశ మరణించిన తరువాత సుశాంత్, రియాల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఆరోజు సుశాంత్ ఇంటికి ఐటీ నిపుణులను పంపించి 8 హార్ట్ డిస్కుల్లో ఉన్న సమాచారం మొత్తాన్ని డిలీట్ చేయించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయాన్ని సుశాంత్ స్నేహితులు సిద్దార్ద్ పితాని, మిరందా, దీపేశ్ సీబీఐ ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

అందులో ఏముంది?
అయితే రియా అంతగా భయపడటానికి అందులో ఏముంది? ఆ హార్డ్ డ్రైవ్స్ సంగతి ఏంటని? నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం అన్ని కోణాల్లో రియాకు గడ్డు పరిస్థితులు నెలకొన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు సీబీఐ, మరోవైపు ఈడి, ఇంకో వైపు సెంట్రలో బ్యూరో ఆఫ్ నార్మోటిక్ డిపార్ట్మెంట్ కాచుకుని కూర్చుంది.


Click it and Unblock the Notifications











