బ్రేకింగ్: పరారీలో రియా చక్రవర్తి.. బీహార్ పోలీసుల వేట.. సుప్రీం కోర్టులో హీరోయిన్ పిటిషన్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజుల వరకు ఎలాంటి సమస్యలు కనిపించని రియాకు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో బీహార్ పోలీసులు దర్యాప్తు ముంబైలో వేగం అందుకొన్నది. ఈ క్రమంలో రియా చక్రవర్తి ఇంటికి వెళ్లిన పాట్నా పోలీసులకు చుక్కెదురైంది. బీహార్ పోలీసులకు మస్కా కొట్టి గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ కేసు గురించి వివరాల్లోకి వెళితే..
Recommended Video

విలువైన వస్తువులు కాజేశారని
తన కుమారుడి మరణం వెనుక రియా చక్రవర్తి హస్తం ఉందనే అనుమానాలు తమకు ఉన్నాయని తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి స్వయంగా వైద్యం చేసి ముప్పులో పడేసింది. ఓవర్‌డోస్ మెడిసిన్ష్ ఇచ్చి మరణానికి కుట్ర పన్నింది. ఇంటిలోని విలువైన వస్తువులను రియా, ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. నగలు, డబ్బు అంతా మాయం చేశారు. సుశాంత్ ఫోన్ తన వద్దే పెట్టుకొని ఫ్యామిలీకి అందుబాటులో లేకుండా చేసింది అని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. దాంతో బీహార్ పోలీసులు ముంబైలో అడుగుపెట్టారు.

ముంబై క్రైమ్ బ్రాంచ్‌తో బీహార్ పోలీసులు భేటి
ముంబై చేరుకొన్న బీహార్ పోలీసులు నగరంలోని దర్యాప్తు బృందాలతో భేటి అయ్యారు. బుధవారం ఉదయమే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను బీహార్ పోలీసులు కలుసుకొన్నారు. ఈ సందర్భంగా బీహార్ పోలీసులకు కేసు డైరీని అందించడమే కాకుండా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా వారితో పంపించారు. ఈ క్రమంలో మరికొంత మంది పోలీసులను పంపించాలని బీహార్ పోలీస్ విభాగాన్ని కోరినట్టు సమాచారం.

పరారీలో రియా చక్రవర్తి
అనంతరం సుశాంత్ సూసైడ్ కేసు దర్యాప్తు కోసం రియా చక్రవర్తి నివాసానికి బీహార్ పోలీసుల వెళ్లగా అక్కడ లేరనే సమాధానం వచ్చింది. అరెస్ట్ భయాల కారణంగా తన ఇంటి నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లినట్టు సమాచారం. దాంతో రియా లేరనే సమాధానంతో బీహార్ పోలీసులు ఆమె ఇంటి నుంచి వెనుతిరిగారు. అయితే రియాను తన లాయర్ మరో ప్రదేశానికి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి.

ముందస్తు బెయిల్‌కు రియా చక్రవర్తి ప్రయత్నాలు
సుశాంత్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనందున రియాను అరెస్ట్ నుంచి తప్పించేందుకు తన లాయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయడం ద్వారా నేరుగా రియాను కోర్టులో హాజరుపరిచేలా లాయర్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని తన నివాసం నుంచి మరో ప్రదేశానికి తరలించినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

సుప్రీంకోర్టులో రియా పిటిషన్
ఇదిలా ఉండగా, పాట్నాలో దాఖలైన కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టు ఏఎన్ఐ వార్త సంస్థ బ్రేకింగ్ అలర్ట్ ఇచ్చింది. రియా తరఫున ఆమె లాయర్ సతీష్ మనేషిండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.

రియాపై నమోదైన ఎఫ్ఐఆర్‌లో...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశాం అని పాట్నా సెంట్రల్ జోన్, ఐఐజీ సంజయ్ సింగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











