అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో రియా చక్రవర్తి .. జూన్ 13 రాత్రి సుశాంత్ ఇంటికి కొందరు అంటూ పితాని

దివంగత సినీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని శుక్రవారం చేయకపోవచ్చనే అభిప్రాయాన్ని సీబీఐ అధికారులు స్పష్టం చేశఆరు. సీబీఐ జారీ చేసిన సమన్లు అందుకొన్న రియా చక్రవర్తి శుక్రవారం (ఆగస్టు 28వ) తేదీన ముంబైలోని డీఆర్డీవో గెస్ట్ హౌస్‌లో జరిగిన విచారణకు హాజరైంది. మధ్యాహ్నం నుంచి విచారిస్తున్న ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్త మీడియాలో ప్రచారం జరిగింది. ఈ కేసు విచారణకు సంబంధింని వివరాల్లోకి వెళితే..

 కొద్ది రోజులుగా నీరజ్, పితాని విచారణ

కొద్ది రోజులుగా నీరజ్, పితాని విచారణ

సుశాంత్ కేసులో గత మూడు రోజులుగా వంట మనిషి నీరజ్, స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, మాజీ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండాను విచారిస్తున్నారు. గురువారం రియా సోదరిని 11 గంటలపాటు విచారించడంతో ఈ కేసు తీవ్రత ఎక్కువగానే కనిపించింది. పలుమార్లు వంట మనిషిని, మాజీ మేనేజర్‌ను విచారించిన తర్వాత రియా చక్రవర్తికి సమన్లు జారీ చేశారు.

 డ్రగ్ కేసు మరింత అనుమానాస్పదం

డ్రగ్ కేసు మరింత అనుమానాస్పదం

సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రియా చక్రవర్తిని ఈడీ, సీబీఐ, ఎన్సీబీ సంయుక్తంగా విచారిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు బయటకు రావడంతో ఈ కేసు విచారణ తీవ్రంగా మారింది. సుశాంత్ కేసుతోపాటు డ్రగ్ వినియోగం కేసును కూడా ఎన్సీబీ అధికారులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

9 గంటలు విచారించిన సీబీఐ

9 గంటలు విచారించిన సీబీఐ

రియా చక్రవర్తిని శుక్రవారం రోజున సీబీఐ 9 గంటలపాటు విచారించింది. ఈ సందర్భంగా పలు విషయాలపై వివరాలను అధికారులు సేకరించినట్టు సమాచారం. అయితే విచారణ అనంతరం రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తో కలిసి శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే ఎవరిపై ఫిర్యాదు చేసిందనే విషయం సీక్రెట్‌గా మారింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
జూన్ 13వ తేదీన రాత్రి సుశాంత్ ఇంటికి కొందరు

జూన్ 13వ తేదీన రాత్రి సుశాంత్ ఇంటికి కొందరు

ఇదిలా ఉండగా, సీబీఐ విచారణలో సిద్ధార్థ పితాని సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. జూన్ 13వ తేదీన చాలా మంది వ్యక్తులు సుశాంత్ ఇంటికి వచ్చారనే విషయం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు జూన్ 13వ తేదీన ఎవరూ రాలేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్న కొందరి ప్రయత్నాలకు పితాని గండికొట్టారనే వాదన ఇప్పుడు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X