twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తికి కోవిడ్ పరీక్షలు.. మరో 14 రోజులు పోలీసుల కస్టడీలోనే?

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బయటపడిన డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 8) అరెస్ట్ చేశారు. ఆమెపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ), 20(b), 27(a), 28, 29 కింద కేసు నమోదు చేశారు.

    అరెస్ట్ అనంతరం తమ కస్డడీలోకి తీసుకోవడానికి ముందు ఆమెకు సియాన్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు జరిపించారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆమెకు కోవిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనావైరస్ నెగిటివ్ అని తేలింది. దాంతో ఆమెను నార్కోటిక్స్ కార్యాలయానికి తరలించారు.

    Rhea Chakraborty has tested COVID-19 negative after arrested by NCB

    రియా అరెస్ట్ నేపథ్యంలో ఆమె తరఫున న్యాయవాది సతీష్ మాన్‌షిండే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌ను ఎన్సీబీ అధికారులు తోసిపుచ్చారు. ఆమెను 14 రోజుల కస్టడీని కోర్టును కోరనున్నట్టు అధికారులు వెల్లడించారు. రియాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కోర్టుకు రిమాండ్ కాపీని సమర్పించారు.

    English summary
    bollywood actress Rhea Chakraborty Arrested By NCB After 19 hours of grilling, Rhea Chakraborty has been arrested by the Narcotics Control Bureau on Tuesday in the drugs case linked to the death of actor Sushant singh Rajput case. After arrest, She was taken to Sohail Hospital for Medical tests. Rhea Chakraborty has tested COVID-19 negative in her medical examination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X