పీకల్లోతు కష్టాల్లో రియా చక్రవర్తి.. 12 వేల పేజీల చార్జిషీట్.. లాయర్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటుడు, స్వర్గీయ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి మరోసారి పీకల్లోతు కష్టాల్లో పడినట్టు స్పష్టమవుతున్నది. సుశాంత్ సూసైడ్ కేసులో భాగంగా ముడిపడి ఉన్న డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
స్టైలిష్ గా పూనమ్ బజ్వా కొత్త ఫోటోషూట్ (ఫొటోలు)

జూన్ 14వ తేదీన సుశాంత్ సూసైడ్
2020 జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ వ్యవహారంలో ప్రియురాలు రియా చక్రవర్తిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ సింగ్ తండ్రి పాట్నాలో దాఖలు చేసిన పిటిషన్‌తో కేసు అనూహ్యమైన మలుపులు తిరిగింది.

సుశాంత్ మరణం వెనుక డ్రగ్స్ కోణం
సుశాంత్ సింగ్ మరణానికి రియా చక్రవర్తి ప్రేరేపించిందనే కోణంలో కేసు నమోదైంది. సుశాంత్ సింగ్ మరణం వెనుక డ్రగ్స్ వ్యవహారం ఉందనే విషయం బయటకు వచ్చింది. దాంతో ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయగా.. వారు నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

12 వేల పేజీలతో చార్జిషీట్
అయితే సుశాంత్ మరణంతో సంబంధముందని భావిస్తున్న ఎన్సీబీ ఈ కేసులో 12 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను విడుదల చేసింది. ఈ కేసులో 32 మందిని నిందితులుగా పేర్కొన్నది. దాదాపు 200 మంది సాక్షులుగా చేర్చింది.

రియా చక్రవర్తిపై చార్జిషీట్.. ఎన్సీబీ క్లారిటీ
రియా చక్రవర్తిపై దాఖలు చేసిన చార్జిషీట్ అనంతరం ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ.. కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ ఛాటింగ్, బ్యాంకు డాక్యుమెంట్లు ఆధారంగా సాక్ష్యాలు సేకరించాం. అంతేకాకుండా సాక్షుల వాగ్మూలాలను సేకరించాం. చార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులపై తదుపరి విచారణ కొనసాగుతుంది అని అన్నారు.

ఊహించిందే.. కట్టుకథలతో చార్జిషీట్.. సతీష్
రియా చక్రవర్తి, ఇతరులపై ఎన్సీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై ఆమె తరపు న్యాయవాది సతీష్ మానేషిండే స్పందించారు. ఎన్సీబీ చార్జిసీట్ ఊహించినట్లే ఉంది. 12 వేల పేజీలతో కూడిన చార్జిషీట్ అంత అభూత కల్పన.. ఓ వ్యంగ్య రచన అంటూ కొట్టిపడేశాడు. తప్పుడు సాక్ష్యాలతో కూడిన చార్జిషీట్ అంటూ కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











