twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతంలోకి రియా చక్రవర్తి.. రేపే ముంబైకి సీబీఐ.. పోలీసు, రాజకీయ వర్గాల్లో కలకలం

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన తర్వాత బాలీవుడ్‌లోను, ముంబై పోలీసుల, రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగాయనే వార్తలు వస్తున్నాయి. తన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో రియా పరిస్థితి దిక్కు తోచకుండా మారిపోయిందనే విషయాన్ని బాలీవుడ్ మీడియా కథనాల్లో పేర్కొంటున్నది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముంబైలో పరిస్థితి ఎలా ఉందంటూ...

    Recommended Video

    Sushant's Case CBI Investigation:పవర్‌ఫుల్ CBI అధికారి చేతికి సుశాంత్ కేసు, క్రైమ్ సీన్ రీ క్రియేట్
     రియా మేడమ్ ఇంట్లో లేరు..

    రియా మేడమ్ ఇంట్లో లేరు..

    హీరోయిన్ రియా చక్రవర్తి తన నివాసం నుంచి గుర్తు తెలియని ప్రదేశానికి తరలి వెళ్లింది. తీర్పును ముందుగానే ఊహించిన ఆమె సురక్షిత ప్రదేశానికి తరలివెళ్లినట్టు సమాచారం. మీడియా రియా ఇంటికి వెళ్లగా మేడమ్ ఇంట్లో లేరనే విషయాన్ని సిబ్బంది వెల్లడించడం కనిపించింది. అయితే ఆమె అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది.

     సీబీఐ బృందానికి మనోజ్ శశిధర్ నాయకత్వం

    సీబీఐ బృందానికి మనోజ్ శశిధర్ నాయకత్వం

    సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సుశాంత్ కేసును విచారించేందుకు సీబీఐ అధికారులు బృందం గురువారం ముంబైలో అడుగుపెట్టనున్నది. సీబీఐ దర్యాప్తు బృందానికి జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ నాయకత్వం వహిస్తారు. ఆగస్టు 20 నుంచే సిబీఐ దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో రియా చక్రవర్తి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లినట్టు తెలుస్తున్నది.

    ముంబైలో షాకింగ్ వాతావరణం

    ముంబైలో షాకింగ్ వాతావరణం

    35 పేజీలో తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర రాజకీయ, సినీ వర్గాల్లో నిర్లిప్తత, ఓ రకమైన షాకింగ్ వాతావారణం కనిపిస్తున్నట్టు సమాచారం. కోర్టు తీర్పు రాగానే ముంబై పోలీస్ కమిషనర్ ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించినట్టు సమాచారం. తీర్పుపై పోలీస్ కమిషనర్‌ను వ్యాఖ్యానించాలని నిరాకరించారు.

    హొంమంత్రి, ఉన్నతాధికారులతో సీఎం భేటీ

    హొంమంత్రి, ఉన్నతాధికారులతో సీఎం భేటీ

    ఇక సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించగానే మహారాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. వెంటనే సీఎం ఉద్దవ్ థాకరే తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. హోం మంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్‌ను నిర్వహించినట్టు సమాచారం.

    English summary
    Bollywood actress Rhea Chakraborty is absconding after Supere Court verdict in Sushant Singh Rajput case. SC has pronounced the verdict that CBI will investigate the Sushant Singh Rajput case furthur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X