twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుశాంత్‌పై విష ప్రయోగం.. రియా చక్రవర్తి హంతకురాలు.. తండ్రి కేకే సింగ్ ఆరోపణలు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, ఆమె సన్నిహితులను అరెస్ట్ చేయాలని తండ్రి కేకే సింగ్ డిమాండ్ చేశారు. రియాకు డ్రగ్ మాఫియాతో లింకులు, సుశాంత్ ల్యాప్ ట్యాప్, కంప్యూటర్లలో డేటా ధ్వంసం చేయడం లాంటి విషయాలు వెలుగులోకి రావడంతో కేకే సింగ్ స్పందిస్తూ రియాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో కేకే సింగ్ మాట్లాడుతూ...

    రియా చక్రవర్తిపై సుశాంత్ ఫ్యామిలీ ఎదురుదాడి

    రియా చక్రవర్తిపై సుశాంత్ ఫ్యామిలీ ఎదురుదాడి

    సుశాంత్ మరణం తర్వాత రెండు నెలలపాటు మౌనం దాల్చిన కుటుంబం రియా చక్రవర్తి, ఇతర స్నేహితులపై ఎదురు దాడి ప్రారంభించింది. రియా చక్రవర్తిపై పలు ఆరోపణలు చేస్తూ పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేయడం ఆ తర్వాత ఆ కేసు ఆధారంగా ఈడీ, సీబీఐ రంగంలోకి దిగి విచారణ చెప్పడం సంచలనంగా మారింది.

    సుశాంత్‌ను హత్య చేసింది రియానే అంటూ

    సుశాంత్‌ను హత్య చేసింది రియానే అంటూ

    సీబీఐ, ఈడీ దర్యాప్తు సాగిస్తున్న సమయంలో రియాపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ నిప్పులు చెరిగారు. తన కుమారుడికి చాలారోజులుగా విష ప్రయోగం చేసింది. సుశాంత్‌ను హత్య చేసింది రియానే. ఆ హంతకురాలిని, ఆమె సన్నిహితులను వెంటనే అరెస్ట్ చేయమని దర్యాప్తు సంస్థలను వేడుకొంటున్నాను అని కేకే సింగ్ అన్నారు.

    సుశాంత్ సింగ్ సోదరి ఆగ్రహం

    సుశాంత్ సింగ్ సోదరి ఆగ్రహం

    రియా చక్రవర్తిపై సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి కూడా ఎదురుదాడి ప్రారంభించారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో సానుభూతి పొందేందుకు, కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు టెలివిజన్ ఛానెళ్లకు రియా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు రియా చక్రవర్తికి వత్తాసు పలుకుతూ ప్రమోట్ చేస్తున్నారు. మీడియాను రియా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకొంటున్నారు అని అన్నారు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    సుశాంత్‌పై డ్రగ్స్ ప్రయోగం

    సుశాంత్‌పై డ్రగ్స్ ప్రయోగం

    రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలనే డిమాండ్‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీ అడ్వకేట్ వికాస్ సింగ్ వ్యక్తం చేశారు. రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకొన్నారా? లేదా? అనే ప్రశ్న కాదు. సుశాంత్‌కు తెలియకుండా ఆయనపై డ్రగ్స్ ప్రయోగించడం చట్టరీత్యా నేరం. ఇదే రుజువైతే హత్యానేరం కింద రియాను అరెస్ట్ చేయడం తథ్యం అని వికాస్ సింగ్ స్పష్టం చేశారు.

    రియా చక్రవర్తిని తప్పుపట్టిన అంకితా లోఖండే

    ఇదిలా ఉండగా, ఇండియా టుడేకిచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి చెప్పిన విషయాలను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే తప్పుపట్టారు. సుశాంత్‌కు క్లాస్ట్రోఫోబియా ఉందని రియా చెప్పడం తప్పు. ఆయనకు ఆకాశంలో విహరించడమన్నా.. ప్రయాణించడమన్నా చాలా ఇష్టం అని అంకితా తెలిపింది. ఈ మేరకు సుశాంత్ స్వయంగా జెట్ విమానం నడిపిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

    English summary
    Bollywood actor Sushant Singh Rajput's father KK Singh made sensational allegations on Rhea Chakraborty. He urged ED, CBI to immediately arrest Rhea. KK Singh released a video in Social media and appealed that Rhea had sedated Sushant and she is the murderer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X