రియా చక్రవర్తి జీవితం నాశనం అంటూ.. బెయిల్ లభించినా తీరని కష్టాలు!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి బెయిల్ లభించినా కష్టాలు తీరేట్టట్టు కనిపించడం లేదు. ఆమె అనేక రూమర్లు చుట్టుముడుతుండటంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 13 తేదీ అర్ధరాత్రి జరిగిన ఓ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై వస్తున్న రూమర్లపై ఫ్యామిలీ లాయర్ ఓ ప్రకటన జారీ చేశారు.

అర్ధరాత్రి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో
రియా చక్రవర్తి ఇంటికి సమీపంలో ఉండే డింపుల్ తవానీ అనే యువతి రియా చక్రవర్తిపై తీవ్రమైన ఆరోపణలు లేవనెత్తారు. తాను సుశాంత్‌గా పేర్కొంటూ రియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 13వ తేది రాత్రి సుశాంత్, రియా కలిసి ఉండటం చూశాం. రియాన తన ఇంటి వద్ద వాహనంలో వచ్చి దింపడం నేను కళ్లారా చూశాను అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

జూన్ 8వ తేదీ గొడవపడిన రియా
వాస్తవానికి రియా వాదన ఏమిటంటే.. సుశాంత్‌తో లాక్‌డౌన్‌లో సుదీర్ఘకాలం గడిపిన తర్వాత జూన్ 8వ తేదీన గొడవ పడి ఇంటికి వెళ్లి పోయాను అని చెప్పారు. అయితే రియా చక్రవర్తికి వాదనకు భిన్నంగా పలువురు ప్రత్యక్ష సాక్షులమని చెప్పుకొంటున్న వారు జూన్ 13 తేదీ రాత్రి సుశాంత్‌తో ఆమె కనిపించిందని చెప్పుకొంటున్నారు.

రియాను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు
రియాను మళ్లీ ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే రియా చక్రవర్తి తరఫు లాయర్ సతీష్ మాన్‌షిండే ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు మీడియాలో పబ్లిసిటీ కోసం వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నా క్లయింట్ రియా లైఫ్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారిపై మేము ప్రత్యేకంగా దృష్టిపెట్టాం అని అన్నారు.

సుశాంత్ అభిమాని అసత్య వాదనలు
జూన్ 13వ తేదీన సుశాంత్‌తో రియా చక్రవర్తిని చూశామని చెబుతున్న అభిమాని మాటల్లో నిజం లేదు. వారు మీడియా సర్కస్‌లో భాగంగా వారు ఫ్రీ పబ్లిసిటీ కోసం పాకులాడుతూ నిందారోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను జర్నలిస్టులు ప్రశ్నించి ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోండి. సత్యమేవ జయతే అంటూ సతీష్ మాన్‌షిండే పేర్కొన్నారు.
Recommended Video

సుశాంత్ కేసులో సత్యమేవ జయతే
సుశాంత్ సింగ్, డ్రగ్స్ కేసుల్లో బెయిల్ రావడంతో రియాకు కొంత ఉపశమనం చేకూరింది. దాదాపు 28 రోజులపాటు జుడిషియల్ కస్టడీలో ఉన్న రియాకు అక్టోబర్ 7వ తేదీన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులో ఆమెకు సంబంధాలు లేవంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారిపై రియా వర్గం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు స్పష్టమవుతున్నది.


Click it and Unblock the Notifications











