రియా చక్రవర్తికి చుక్కలు చూపిస్తున్న ఈడీ.. సుదీర్ఘంగా విచారణతో ఉక్కిరిబిక్కిరి!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారని, అలాగే ఆయన డబ్బును దుర్వినియోగం చేస్తూ అనేక కుట్రలు పన్నారనే ఆరోపణలతో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ ఫిర్యాదుతో పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, బిజినెస్ మేనేజర్ శృతిమోడీని విచారిస్తున్నారు. అయితే రియా చక్రవర్తి తీరుతో అధికారులు ఆగ్రహంతో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు
సుశాంత్ మరణం కేసుపై పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. రియాను ఆగస్టు 7న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేస్తే.. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. అందువల్ల విచారణ నుంచి తనను మినహాంచాలని కోరింది. అయితే అధికారులు తన కోరికను రిజెక్ట్ చేయడంతో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి విచారణకు తప్పనిసరి పరిస్థితిలో హాజరయ్యారు.

మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
సుశాంత్ సింగ్ బ్యాంక్ అకౌంట్లు, కంపెనీలకు నిధుల మళ్లింపు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందా? సంఘ విద్రోహక శక్తులకు ఈ నిధుల మళ్లింపులో ప్రమేయం ఉందా? చట్ట వ్యతిరేకమైన ఆస్తుల క్రయ విక్రయాలు జరిగాయా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో శువ్రవారం రియా సోదరుడిని రెండు గంటలపాటు విచారించారు. అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తూ మీడియా కంటపడ్డారు.

సుదీర్ఘంగా రియా, ఇంద్రజిత్, మోడీ విచారణ
ఇక రియా చక్రవర్తిని, ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, శృతి మోడీని సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు కొనుగోలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబివ్వకుండా మొండికేస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సమాధానాలు చెప్పకుండా మొండిగా
ఈడీ దర్యాప్తులో భాగంగా అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా చక్రవర్తి సమాధానాలు చెప్పకుండా దాటవేసేందుకు ప్రయత్నించారని, అయితే అధికారులు అదే విధంగా ఆమెను పలు రకాల ప్రశ్నలతో జవాబు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని బాలీవుడ్ మీడియా తమ కథనాల్లో పేర్కొన్నారు.
Recommended Video

పలు డాక్యుమెంట్ల పరిశీలన
రియాను ప్రశ్నిస్తూనే పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారనే విషయాన్ని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో డైరెక్టర్ హోదాను వెల్లడించే పత్రాలు, ముంబైలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, అలగే 2015 నుంచి 2020 మార్చి వరకు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పత్రాలను సమర్పించాలని అధికారులు కోరినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











