మాట మార్చిన రియా చక్రవర్తి.. ఉచ్చు బిగుస్తుండటంతో యూటర్న్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఆయన ప్రేయసి రియా చక్రవర్తి అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే కాకుండా వివాదాస్పదంగా మారుతున్నది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో రియా పరారీలో ఉన్నారు. అయితే అజాతంలోనే ఉంటూ ఆమె చేస్తున్న ప్రకటనలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా సీబీఐ దర్యాప్తుపై చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

రియా చక్రవర్తిపై పలు అనుమానాలు

రియా చక్రవర్తిపై పలు అనుమానాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత అందరి చూపు రియా చక్రవర్తిపైనే పడింది. ఆమె వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సుశాంత్ తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నారని, ఆ కారణంగానే తాను సూసైడ్ చేసుకొని ఉంటారని ఆమె స్పష్టం చేశారు.

అమిత్ షాకు రియా చక్రవర్తి ట్వీట్

అమిత్ షాకు రియా చక్రవర్తి ట్వీట్

అయితే ఆ తర్వాత రియా చక్రవర్తి వెంటనే మాట మార్చేసింది. సుశాంత్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలువడుతుండటంతో తనకు సుశాంత్ మరణంపై అనేక సందేహాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ కేసును సీబీఐ దర్యాప్తు అప్పగించాలని ట్వీట్ చేస్తూ అమిత్ షాకు రిక్వెస్ట్ చేసింది.

మీకు చేతులు జోడించి వేడుకొంటున్నా

మీకు చేతులు జోడించి వేడుకొంటున్నా

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రిక్వెస్ట్ చేస్తూ.. గౌరవనీయులైన అమిత్ షా సార్.. నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని. సుశాంత్ మరణించి నెల రోజులు గడిచిపోయాయి. నాకు ప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం ఉంది. కానీ న్యాయం జరుగాలనే ఉద్దేశంతో మీరు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రెండు చేతులు జోడించి వేడుకొంటున్నాను అంటూ రియా ట్వీట్ చేసింది.

సిబీఐకు సిఫారసు చేసే హక్కు ఉందా?

సిబీఐకు సిఫారసు చేసే హక్కు ఉందా?

ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ క్రమంలో రియా చక్రవర్తి న్యాయవాది అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సిఫారసు చేయడం తప్పు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా కేసును ఎలా బదిలీ చేస్తారు అని సతీష్ మాన్‌షిండే అన్నారు.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
బీహార్ చట్టాలకు వ్యతిరేకంగా

బీహార్ చట్టాలకు వ్యతిరేకంగా

సుశాంత్ సింగ్ కేసును టేకప్ చేయడంలో న్యాయస్థాన పరిధి, చట్టపరమైన అంశాలు, ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ కేసును సిబీఐకి అప్పగించే అధికారం బీహార్ ప్రభుత్వానికి లేదు. బీహార్ పోలీసులు చట్టవ్యతిరేకమైన విధానాలను అవలంభిస్తున్నారు. ఈ కేసును విచారించే అధికారం బీహార్ పోలీసులకు లేదు. ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X