ఇక దేవుడిపైనే భారం.. భోరున ఏడ్చిన రియా చక్రవర్తి.. వీడియో రిలీజ్ చేసి..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం రోజుకో మలుపులు తిరుగుతోంది. సుశాంత్ తండ్రి కేకే సింగ్.. రియా చక్రవర్తిపై ఆరోపణలు చేసినప్పటి నుంచి ఈ కేసు యూ టర్న్ తీసుకుంది. అప్పటి వరకు బాలీవుడ్ పెద్దలు, నెపోటిజం చుట్టూ తిరిగిన ఈ కేసు ఒక్కసారిగా రియాకు చుట్టుకుంది. సుశాంత్ ప్రేయసిగా చివరి వరకు సుశాంత్ వెంట ఉంది. పైగా బ్యాంక్ అకౌంట్‌ను పరిశీలిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందుకే సుశాంత్ ఫ్యామిలీ రియాపై ఫిర్యాదు చేసింది.

Recommended Video

Sushant Singh Rajput: Rhea Chakraborty రిలీజ్ చేసిన వీడియో పై TROLLS, కపట నాటకం Acting అంటూ !
డబ్బును విచ్చల విడిగా..

డబ్బును విచ్చల విడిగా..


సుశాంత్ డబ్బను రియా విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుంచి వేరే ఖాతాలకు కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. అంతే కాకుండా రియా సోదరుడు సైతం సుశాంత్‌ను బాగానే వాడుకున్నాడని తెలుస్తోంది. సుశాంత్ కారును ఇప్పటికీ ఆమె సోదరుడు వాడుతున్నాడని తెలుస్తోంది.

దాదాపు 15 కోట్లు..

దాదాపు 15 కోట్లు..

సుశాంత్ డబ్బును రియా వాడుకుందని, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా సుశాంత్ క్రెడిట్ కార్డులను రియా వాడేదని తెలుస్తోంది. సుశాంత్‌కు ఓవర్ డోస్ మందులను ఇచ్చిందని, డిప్రెషన్‌కు కారణమైందని సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా 15 కోట్లు వాడుకుందని సమాచారం.

పలు సెక్షన్లు..

పలు సెక్షన్లు..

రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఖరీదైన లాయర్..

ఖరీదైన లాయర్..

ముంబై బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ అరెస్ట్ తర్వాత బెయిల్ కోసం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సల్మాన్ ఖాన్‌ను కాపాడటానికి సతీష్ మానెషిండే తన వంతు ప్రయత్నాలు చేశారు. అలాంటి ఖరీదైన లాయర్‌ను రియా నియమించుకుంది. దీంతో రియాపై అనుమానాలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ఇప్పుడేం మాట్లడను..

ఇప్పుడేం మాట్లడను..


‘నాకు దేవుడి మీద, న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. మీడియాలో నా గురించి ఎన్ని ఆరోపణలు వస్తున్నా సరే.. మా న్యాయవాది సలహా మేరకు నేను ఇప్పుడు ఏం మాట్లడదల్చుకోలేదు. తీర్పు వచ్చే వరకు నేనేం మాట్లడను. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.. సత్యమేవ జయతే' అంటూ రియా ఓ వీడియోను విడుదల చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X