twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసును సిబీఐకి అప్పగించండి.. అమిత్ షాకు చేతులెత్తి మొక్కిన రియా

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి (జూన్ 14) నెలరోజులు దాటిపోయింది. సుశాంత్ చనిపోయి నెలరోజులు అయిన సందర్భంగా ప్రేయసి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఎమోషనల్ అయింది. అయితే రియా ఒకటి అనుకుని చేస్తే మరోకటి అయింది. రియాను నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మొసలి కన్నీరు అంటూ రియాను విపరీతంగా ట్రోల్ చేశారు. ఇక నెటిజన్ల దెబ్బకు తట్టుకోలేకనో ఏమో గానీ రియా అమిత్ షాకు ఓ ట్వీట్ చేసింది.

    Recommended Video

    Sushant Singh Rajput కేసులో CBI ఎంక్వైరీ కోరుతూ Amit Shah కు చేతులెత్తి మొక్కిన Rhea Chakraborty
    నెలరోజులైన సందర్భంగా..

    నెలరోజులైన సందర్భంగా..

    సుశాంత్ సింగ్ మరణించి నెల రోజులు అయిన సందర్భంగా మాజీ ప్రేయసి రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది. ‘నీవు లేవనే బాధ, ఆ భావోద్వేగాలోంచి బయటపడటానికి ఇంకా కష్టపడుతున్నాను .. నా హృదయం మొత్తం మూగబోయింది. ప్రేమను, దాని శక్తిని విశ్వసించేలా చేసిన వ్యక్తివి నువ్వు. నిన్ను కోల్పోయి 30 రోజులు అవుతుంది కానీ నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తెగ ఎమోషనల్ అయింది.

    రియాపై విపరీతమైన ట్రోలింగ్..

    రియాపై విపరీతమైన ట్రోలింగ్..

    ఇక రియా చేసిన పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదని, ఇప్పుడు మాత్రం గుర్తుకు వచ్చాడా? ఇన్ని రోజులు ఏమైందని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. మొసలి కన్నీరు కార్చొద్దని ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రేప్ చేస్తాం..

    రేప్ చేస్తాం..

    తాజాగా సోషల్ మీడియాలో రియాకు బెదిరింపులు కూడా వచ్చాయట. రేప్ చేస్తాం. చంపేస్తాం.. లేదా ఆత్మహత్య చేసుకో అంటూ రియాను బెదిరించారట. వీటిపై రియా స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కాస్త ఎమోషనల్ అయింది. ఇక కాసేటికే రియా మరో ట్వీట్ చేస్తూ అమిత్ షాను వేడుకుంది.

    సుశాంత్ ప్రేయసిని నేను..

    సుశాంత్ ప్రేయసిని నేను..

    సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని రియా కోరుతూ ఓ ట్వీట్ చేసింది. ఈ మేరకు ‘గౌరవనీయులైన అమిత్ షా సర్‌కు.. నేను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్‌ను.. ఆయన చనిపోయి నెల అవుతోంది.. నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది.. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది..

     కారణం తెలియాలి..

    కారణం తెలియాలి..

    మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నా.. సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించండి. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలేంటో నేను తెలుసుకోవాలి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాల'ని అమిత్ షాను వేడుకుంది.

    English summary
    Rhea Chakraborty request To Amit Shah To CBI Inquiry In sushant suicide. I request you with folded hands to initiate a CBI enquiry into this matter . I only want to understand what pressures , prompted Sushant to take this step. Yours sincerely
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X