బ్రేకింగ్: రియా చక్రవర్తికి మరో ఎదురుదెబ్బ.. కోర్టు ఆదేశంతో జైలులోనే విలవిల!

బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి మరో ఎదురు దెబ్బ తగిలింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో మరో 14 రోజులపాటు ఆమె జైలులోనే గడపాల్సి ఉంటుంది. దీంతో బాలీవుడ్ డ్రగ్ రాకెట్‌ దందాను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో స్పష్టమవుతుందనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ గురించి పూర్తి వివరాలు..

రియా చక్రవర్తిపై బలమైన సెక్షన్లు

రియా చక్రవర్తిపై బలమైన సెక్షన్లు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ఈడీ విచారిస్తున్న సమయంలో ఆమె వాట్సప్ ఛాటింగ్‌లో డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలు బయటపడ్డాయి. దాంతో తీగ లాగగా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి ఉన్న డ్రగ్ మాఫియా లింకులు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తులోభాగంగా రియా, షోవిక్‌ను విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. రియా చక్రవర్తిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ), 20(b), 27(a), 28, 29 కింద కేసు నమోదు చేసి కస్టడీకి తరలించారు.

ఎన్సీబీ వాదనకు సానుకూలంగా కోర్టు

ఎన్సీబీ వాదనకు సానుకూలంగా కోర్టు

సెప్టెంబర్ 8వ తేదీన అరెస్ట్ అయిన రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆమె అభ్యర్థను సెప్టెంబర్ 11న తిరస్కరించి 14 రోజుల కస్టడీకి తరలించారు. కస్టడీ సెప్టెంబర్ 22న పూర్తి కావడంతో రియా చక్రవర్తి మరోసారి బెయిల్ పిటిషన్‌ను ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు విచారించింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ లింకులపై దర్యాప్తు కొనసాగుతున్నందున్న బెయిల్ ఇవ్వడం సరికాదనే ఎన్సీబీ వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.

మరో 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రియా

మరో 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రియా

రియా బెయిల్ పిటిషన్‌పై ఆమె తరపు లాయర్ సతీష్ మాన్‌షిండే వినిపించిన వాదనలు.. ఎన్సీబీ వాదనలు విన్న తర్వాత ఆమె బెయిల్ పిటిషన్‌ను ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. మరో 14 రోజుల కస్టడీకే అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. దాంతో అక్టోబర్ 6వ తేదీ వరకు బైకుల్లా జైలులోని కస్టడీలో ఉండాల్సి వచ్చింది. కోర్టు తీర్పుతో భారీ ఎదురుదెబ్బ తగిలిందనే మాట వినిపిస్తున్నది.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
రియా చక్రవర్తి సోదరుడికి కూడా చుక్కెదురు..

రియా చక్రవర్తి సోదరుడికి కూడా చుక్కెదురు..

రియా చక్రవర్తి పిటిషన్ కాకుండా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఇతరుల బెయిల్ పిటిషన్‌ను ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. షోవిక్, దీపేశ్ సావంత్, శ్యామ్యూల్ మిరాండా చేసుకొన్న బెయిల్ పిటిషన్లను కూడా తిరస్కరించింది. దాంతో వారికి కూడా అక్టోబర్ 6వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. కాగా, మంగళవారం రియా చక్రవర్తి మేనేజర్‌ జయా సహాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X