జైల్లో అతి దారుణంగా రియా చక్రవర్తి.. ఇరుకు రూమ్‌లో.. కటిక నేలపైనే..
బాలీవుడ్ డ్రగ్ మాఫియా కేసులో అరెస్టైన రియా చక్రవర్తికి ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించడంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకు డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కస్టడీలోనే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా, దీపేశ్ సావంత్‌ను కూడా కస్టడీకి తరలించారు. అయితే బైకులా జైలులో ఉంటున్న రియా చక్రవర్తి గురించి మీడియా దృష్టికి వచ్చిన షాకింగ్ విషయాలు ఏమిటంటే..
Recommended Video

ఇంద్రాణి ముఖర్జి పక్క గదిలోనే రియా చక్రవర్తి
డ్రగ్స్ కేసులో న్యాయవాది సతీష్ మాన్‌షిండే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో రియా చక్రవర్తికి బైకులా జైలులో ప్రత్యేక గదిని కేటాయించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జి పక్క గదినే రియా చక్రవర్తికి కేటాయించడం గమనార్హం. సొంత కూతురిని హత్య చేసిన కేసులో ఇంద్రాణి ఈ జైలులోనే శిక్ష పొందుతున్నారు.

తోటి ఖైదీల దాడి చేయవచ్చనే కారణంతో
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తికి తోటి ఖైదీలు దాడి చేస్తారనే ముందస్తు జాగ్రత్తతో ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించినట్టు జైలు అధికారులు వెల్లడించినట్టు సమాచారం. రియాకు ఎలాంటి ముప్పు కలుగకుండా సింగిల్ రూమ్‌ను కేటాయించామని పేర్కొన్నట్టు తెలిసింది. అయితే రియాకు కేటాయించిన సింగిల్ రూమ్‌లో ఫ్యాన్, బెడ్ లాంటి కనీస సౌకర్యాలు లేవనే విషయాన్ని అధికారుల తెలిపారు.

కటిక నేలపై చాపపైనే పడక
రియా చక్రవర్తి ఉన్న గదికి 24 గంటలపాటు రక్షణను ఏర్పాటు చేశారు. ఆమె గదికి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను ఏర్పాటు చేసి మూడు షిప్టులతో పహారా కాస్తున్నారు. అయితే కటిక నేలపై పడుకోకుండా ఆమెకు చాప ఇచ్చారని, దిండు, పరుపు లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. విలాసవంతమైన జీవితం గడిపిన ఆమెకు ఇరుకు గదిని ఏర్పాటు చేయడంతో ఇబ్బందికి గురైనట్టు తెలిసింది.

కరోనా నేపథ్యంలో పసుపు పాలు
ముంబైలో కరోనావైరస్ పరిస్థితులు విజృంభిస్తున్న నేపథ్యంలో బైకులా మహిళా జైలులో గత కొద్దికాలంగా పసుపు కలిపిన పాలను సరఫరా చేస్తున్నారని, ఇటీవల జైలుకు వచ్చిన రియా చక్రవర్తికి కూడా ఇమ్యునిటీ పెంచేందుకు పసుపుతో కూడిన పాలను ఇస్తున్నట్టు సమాచారం. అయితే తొలి రోజు ఎలాంటి ఆహారం తీసుకోకుండా గదిలోనే ఒంటరిగా గాల్లోకి చూస్తూ కూర్చొన్నట్టు జైలు వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











