మహేష్ భట్ తండ్రిలాంటి వారు.. సుశాంత్ ఆ డగ్ర్ తీసుకునేవాడు.. రియా సెన్సేషనల్ కామెంట్స్

సుశాంత్ సింగ్ కేసులో అతని ప్రేయసి రియా చక్రవర్తినే ప్రథమ ముద్దాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెపై సీబీఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ కన్ను వేశాయి. ఓ వర్గం మీడియా కూడా రియాను ముద్దాయిగా చిత్రీకరించే పనిలో ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న రియా తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో రియా చెప్పిన విషయాలు, మాట్లాడిన మాటలతో సోషల్ మీడియాలో మరో కొత్త వాదన మొదలైంది.

బిడ్డను కూడా కనాలని..

బిడ్డను కూడా కనాలని..


సుశాంత్ లాంటి గొప్ప నటుడు అయ్యే చోటా సుశాంత్ కావాలని అనుకున్నాం. నా దృష్టిలో సుశాంత్ భూమ్మీద అందరిలోకెల్లా ఓ గొప్ప మనిషి. నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. పైనుంచి సుశాంత్ వీటన్నంటిని చూస్తుంటాడు. ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకోవాలి. నా కోణాన్ని కూడా చూడాలి అని రియా కోరింది.

విలన్‌ను చేయాలని..

విలన్‌ను చేయాలని..


సుశాంత్ కేసులో నన్ను విలన్‌ను చేయాలని చూస్తున్నారు. ఏ వ్యక్తి అయినా సరే తనకు కావాల్సిన వారిని కోల్పోయినప్పుడు వారినే నిందించడం కాదు.. వారి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. ఓ వ్యక్తి మన మధ్య లేనప్పుడు అతని వ్యసనాల గురించి మాట్లాడాల్సి రావడం దురదృష్టం. సుశాంత్ మార్జువానా సిగరెట్ (డ్రగ్)ను తీసుకునేవాడు. కానీ నేను పరిచయం కాకముందు నుంచీ తాగేవాడు. కేదార్ నాథ్ షూటింగ్ సమయంలోనూ తాగేవాడు.. నేను ఎంత చెప్పినా మానలేదు అని చెప్పుకొచ్చింది.

మహేష్ భట్ తండ్రిలాంటివారు..

మహేష్ భట్ తండ్రిలాంటివారు..

మహేష్ భట్ తనకు తండ్రిలాంటి వారు.. నాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు అని రియా క్లారిటీ ఇచ్చింది. మీటూ ఆరోపణల వల్ల సుశాంత్ డిప్రెషన్‌లోకి వెళ్లాడు.. దిల్ బేచారా హీరోయిన్ సంజనా సంఘీ చేసిన ఆరోపణలతో సుశాంత్ బాధపడ్డాడు. వాటి వెనుక ఎవరో ఉన్నారని నాతో చెప్పుకుని బాధపడేవాడు అని రియా తెలిపింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
రియాకు మద్దతుగా..

రియాకు మద్దతుగా..

ఇక రియా ఇచ్చిన ఇంటర్వ్యూ బాగానే వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఓ వర్గం కూడా రియాకు మద్దతు తెలుపుతోంది. రియాకు న్యాయం జరగాలి. రియా కోణాన్ని కూడా అందరూ వినాలి.. ఆమె చెప్పిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆమెను ఇలా ఏకపక్షంగా ట్రోల్ చేయడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X