రియా చక్రవర్తి మళ్లీ చేతుల ఊపుతూ ఉత్సాహంగా.. బైకులా జైలుకు తరలింపు
సుశాంత్ సింగ్ మరణం కేసులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా సంబంధాల కోణంలో దర్యాప్తు జరిపిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు మంగళవారం రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం మెడికల్ టెస్టులు నిర్వహించి ఆన్‌లైన్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను కస్డడీలోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో రియా వ్యవహరిస్తున్న తీరు మీడియాలో చర్చనీయాంశమైంది..

రియా చక్రవర్తి చేయి పైకెత్తి జైకొట్టినట్టు
డ్రగ్స్ వినియోగం, సరఫరా తదితర అంశాలపై రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి సియాన్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ సందర్భంలో రియా తన చేతిని పైకెత్తి జై కొడుతూ మీడియాకు విష్ చేస్తూ కారు ఎక్కారు. ఆ వీడియో ఫుటేజ్ మీడియాలో వైరల్ అయింది.

సెప్టెంబర్ 22 వరకు కస్టడీ
కోర్టు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు అయితే కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆమెను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొన్నారు. ఆమె సెప్టెంబర్ 22 వరకు ఎన్సీబీ అధికారుల కస్టడిలో ఉంటారు.

పోలీస్ వ్యాన్‌లో తరలిస్తుండగా ఉత్సాహంగా
డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత రియా చక్రవర్తిని బైకులా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ వాహనంలో వెళ్తూ రియా చక్రవర్తి మీడియాకు చేతులు ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు. అరెస్ట్‌కు సంబంధించిన విచార ఛాయలు రియా ముఖంలో కనిపించకపోవడం ప్రస్తుతం చర్చగా మారింది.
Recommended Video

షోవిక్ చక్రవర్తి కోర్టులో హాజరు
ఇదిలా ఉండగా, షోవిక్ చక్రవర్తి, శ్యామూల్ మిరాండా, దిపేశ్ సావంత్ కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. నాలుగు రోజుల క్రితం వారిని అరెస్ట్ చేయగా, వారికి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడికి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జార చేసింది.


Click it and Unblock the Notifications











