రియా జైలుకు తరలింపు.. నేరం రుజువైతే ఎన్ని సంవత్సరాల శిక్ష అంటే.. లగ్జరీ లైఫ్ నుంచి కష్టాల్లోకి!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో బయటపడిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా, పనిమనిషి దీపేశ్ సావంత్‌ను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. రియా అరెస్ట్ తర్వాత ఏం జరుగబోతుందంటే...

14 రోజుల కస్టడీకి అప్పగింత
హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో ఆమె చేసుకొన్న బెయిల్ పిటిషన్‌ను ఎన్సీబీ అధికారులు వ్యతిరేకించారు. రియాను 14 రోజుల కస్టడీకి తీసుకొన్నారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జైలుకు తరలించారు.

రియాకు డ్రగ్ మాఫియాతో బలమైన సంబంధాలు
రియాను మూడు రోజులపాటు విచారించిన ఎన్సీబీకి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ కోసం డ్రగ్స్ సమకూర్చడం, వినియోగించారనే విషయాలను తెలుసుకొన్నారు. ఆ క్రమంలోనే డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు బయటపడ్డాయి. దాంతో రియాపై బలమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

రియా చక్రవర్తిపై బలమైన సెక్షన్లు
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిపై బలమైన కేసులను ఎన్సీబీ నమోదు చేసింది. డ్రగ్స్ సమకూర్చుకోవడం, వినియోగం, ఎగుమతి, దిగుమతి, అమ్మకాలు, పలు రాష్ట్రాలకు సరఫరా, ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి, అక్రమ రవాణ, అక్రమంగా నిల్వ చేసుకోవడం లాంటి అంశాలపై కేసు నమోదు చేశారు. రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 89 (సీ), 20(b), 27(a), 28, 29 కింద కేసు నమోదు చేశారు.

ఎందుకు ఈ సెక్షన్లను విధించారంటే
రియాపై పెట్టిన సెక్షన్ల ప్రకారం.. డ్రగ్స్ అక్రమ నిల్వ, సరఫరా, వినియోగంపై సెక్షన్ 8 (సీ), అక్రమ రవాణా, ఇరు రాష్టాల మధ్య సరఫరా, జరిమానా అంశాలపై 20 (బీ), నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ సబ్‌స్టాన్స్ వినియోగం కింద 27 (a), క్రిమినల్ కుట్ర, ఆత్మహత్యకు ప్రేరణ అంశాలపై 28, 29 సెక్షన్లను విధించారు.
Recommended Video

10 సంవత్సరాల జైలుశిక్ష.. 2 లక్షల లోపు జరిమానా
రియా చక్రవర్తిపై విధించిన సెక్షన్లలో శిక్ష పలు రకాలుగా ఉంటుంది. ఒక సెక్షన్, మరో సెక్షన్‌కు శిక్ష మారుతుందనే మాటను న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నారు. సెక్షన్ 8 సీ కింద ఆమెకు 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా 1 లక్ష నుంచి 2 లక్ష రూపాయల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. ఇతర సెక్షన్ల విషయానికి వస్తే.. 1 నుంచి 10 సంవత్సరాల శిక్ష, 20 వేల నుంచి 2 లక్షల లోపు జరిమానా విధించడానికి స్కోప్ ఉంది.


Click it and Unblock the Notifications











