Sushanth death Anniversary రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన రియా చక్రవర్తి.. నెటిజన్లు దారుణంగా ట్రోల్స్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తిరిగి రాని లోకాలకు వెళ్లి మూడేళ్లు అవుతున్నది. ఆయన మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనేది వాస్తవం. సుశాంత్ మరణం తర్వాత ఆయన మరణంపై నమోదైన కేసు అనేక మలుపులు తిరుగుతూ ఎడతెగని సీరియల్‌లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలి రియా చక్రవర్తిపైనే అందరి దృష్టి పడింది. అయితే సుశాంత్ సినిమా 3వ వర్ధంతి సందర్భంగా రియా చక్రవర్తి చేసిన వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆమె అనుభవించిన పరిస్థితులు, వారిద్దరి మధ్య అఫైర్ గురించిన వివరాల్లోకి వెళితే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి మధ్య డేటింగ్ వ్యవహారం చాలా కాలం జరిగింది. వారిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని ప్రేమపక్షుల్లా బాలీవుడ్‌లో కనిపించారు. అయితే సుశాంత్ జూన్ 14వ తేదీ ఉరి వేసుకొని మరణించే ముందు కొన్ని రొజుల వరకు రియా అతడితోనే ఉంది. సుశాంత్ సింగ్‌తో గొడవపడి రియా చక్రవర్తి వెళ్లిన తర్వాతే ఆత్మహత్య సంఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు దారి తీసింది.

Rhea Chakraborty

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారంపై పలు సందేహాలు తలెత్తడంతో 2020లో బీహార్‌లో ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఈ కేసు నుంచి ముంబై పోలీసులను తప్పించారు. సీబీఐ, ఈడీ, ఎన్సీబీ రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేపట్టాయి. ఆ తర్వాత రియా చక్రవర్తిని పలుమార్లు విచారించారు. తదనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Rhea Chakraborty

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి ముంబైలోని బైకుల్లా జైలులో ఉంచారు. దాదాపు రియా చక్రవర్తి 28 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరకు ఆమె అరెస్ట్ అయిన తర్వాత 28 రోజులకు ఆమెకు ఈ కేసులో బెయిల్ లభించింది.

Rhea Chakraborty

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూడో వర్ధంతిని పురస్కరించుకొని రియా చక్రవర్తి తమ అనుబంధానికి, ప్రేమకు గుర్తుగా ఓ రేర్ వీడియోను షేర్ చేసింది. 2019లో రియా, సుశాంత్ లడఖ్ ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లిన సమయంలో వారిద్దరూ ఈ వీడియోను తీయించుకొన్నారు. పెద్ద బండరాయిపై వారిద్దరూ కూర్చుండగా వీడియోను షూట్ చేశారు. ఆ వీడియోలో సుశాంత్‌ను గట్టిగా పట్టుకొని కౌగిలిలో బంధించి రొమాంటిక్‌గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

అయితే సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై కొందరు సానుభూతి చూపిస్తే.. మరొకొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. నీవు చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్నావు. నిన్ను చూస్తే బాధేస్తుంది అని కొందరు అంటే.. సుశాంత్‌కు అన్యాయం చేసి.. ఇప్పుడు నీవు వీడియో పెట్టి ఎంజాయ్ చేస్తున్నావా? అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. ఈ వీడియోకు కొన్ని గంటల్లోనే సుమారు 1 లక్ష లైక్స్ రావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X