లైంగిక వేధింపులు: ఆమె వల్లే సుశాంత్ డిప్రెషన్‌కి గురయ్యాడు.. మరో నటిపై రియా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి అసలు కారణం ఏమిటనేది తెలిసేవరకు కొంత మంది స్టార్స్ కి నిద్ర పట్టేలా లేదని అర్ధమవుతోంది. ముఖ్యంగా రియా చక్రవర్తికి సంబంధించిన అనేక ఆరోపణలు ఆమెను ఆ మిస్టరీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక రియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక హీరోయిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

రియా.. ఎందుకిలా?
మొన్నటివరకు కనీసం మీడియాకు మొహం చూపించని రియా చక్రవర్తి ఇప్పుడు మాత్రం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కాస్త బిజీగా మారింది. అయితే ఇంత సడన్ గా రియా ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తోందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక తనపై వస్తున్న తప్పుడు వార్తలపై క్లారిటీ ఇవ్వడానికి మీడియా ముందుకి ఇప్పుడు రావాల్సి వచ్చిందని రియా చెబుతోంది.

ఆమె వల్లే డిప్రెషన్..
ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రియా మరో బాలీవుడ్ హీరోయిన్ సంజనా సంఘిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. ఆమె వల్లే సుశాంత్ డిప్రెషన్ కి గురయ్యాడని కూడా రియా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారాలో సంజనా హీరోయిన్ గా నటించింది.

షూటింగ్ లో లైంగిక వేధింపులు
అయితే దిల్ బేచారా సినిమా షూటింగ్ లో సుశాంత్ లైంగిక వేధింపులు పాల్పడ్డాడని అప్పట్లో సంజనా ఆరోపించినట్లు రియా వివరణ ఇస్తూ... ఆమె వల్లే సుశాంత్ తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్లాడని ఆమె మీటూ ఆరోపణల వలన సుశాంత్ ఆరోగ్యం కూడా చెడినట్లు మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా ఆమె కామెంట్స్ నేషనల్ మీడియాలో హాయ్ టాపిక్ గా మారాయి.
Recommended Video

క్లారిటీ ఇచ్చిన సంజన
ఇక రియా చేసిన కామెంట్స్ పై సంజన వెంటనే సమాధానం ఇచ్చింది. అందులో ఎలాంటి నిజం లేదు. నేను అమెరికా వెళ్లినప్పుడు ఇక్కడ తప్పుడు వార్తలు వచ్చాయి. అయితే నేను రాగానే వాటిని కొట్టిపారేశాను. సుశాంత్ నాకు మంచి స్నేహితుడు. అతను చాలా మంచి వ్యక్తి. దయచేసి ఈ వివధాల్లోకి నన్ను లాగవద్దు. ఇక సుశాంత్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదలద్దు అని సంజనా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











