For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తి.. బెయిల్ లభించిన మరుసటి రోజే..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో అరెస్ట్‌ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి దాదాపు నెల రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై అక్టోబర్ 7వ తేదీన రిలీజ్ అయ్యారు. సుశాంత్ కేసులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కేసు విచారణలో బయటకు వచ్చిన అంశాల ఆధారంగా రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

    బెయిల్‌పై బయటకు వచ్చిన రియా చక్రవర్తి గురువారం అంటే అక్టోబర్ 8 తేదీన ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో హజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం పాస్‌పోర్టును సమర్పించాల్సి ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె 10 రోజులపాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వ్యక్తిగత హాజరును సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో శాంతాక్రజ్ పోలీసుల ముందు తన తండ్రి ఇంద్రజిత్‌ చక్రవర్తితో కలిసి హాజరయ్యారు.

    రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్‌ను బాంబే హైకోర్టు మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే రూ.1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాల్సి ఉంటుంది.

    Rhea Chakraborty snapped at Santacruz police station

    ఇక డ్రగ్స్ కేసులో రియాకు ఊరట లభించినప్పటికీ.. తన సోదరుడికి బెయిల్ లభించకపోవడం మనస్తాపానికి గురిచేసినట్టు సమాచారం. డ్రగ్స్ సప్లయర్ అబ్దుల్ బాసిత్ పరిహార్‌తో షోవిక్ సంబంధాలను కోర్టు తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తున్నది. ఆ కారణంగా ఆయనకు బెయిల్ తిరస్కరించినట్టు సమాచారం.

    English summary
    Bombay High court granted bail to Rhea Chakraborty in Bollywood drug rocket case. As per Bombay High court directions, Rhea to present in Santacruz police station police station for 10 days. She along with her father Indrajit Chakraborty appeared in the Police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X