సుశాంత్ సింగ్ ఇంట్లో టాలీవుడ్ హీరోయిన్.. లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా రొమాన్స్!

By Manoj

సినీ రంగంలో ప్రేమ పక్షులకు కొదవే ఉండదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా హిందీ చిత్ర పరిశ్రమలో లవ్ బర్డ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీరిలో కొందరు రహస్యంగా ప్రేమాయణం సాగిస్తుంటే... మరికొందరు మాత్రం బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ కపుల్ రెహా చక్రవర్తి - సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జంట ఒకటి. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ జంట.. లాక్‌డౌన్‌ పిరియడ్‌లోనూ రహస్యంగా రొమాన్స్ చేసిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

 ధోనీ వల్ల పాపులర్ అయిపోయిన యంగ్‌స్టర్

ధోనీ వల్ల పాపులర్ అయిపోయిన యంగ్‌స్టర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలలో ఒకడు. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్‌స్టర్... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌తో అమాంతం పాపులర్ అయిపోయాడు. అంతేకాదు, ఆ తర్వాత కొన్ని ఇండస్ట్రీ హిట్లను దక్కించుకుని భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

మహేశ్ హీరోయిన్‌తో లవ్.. పెళ్లికి ముందు బై

మహేశ్ హీరోయిన్‌తో లవ్.. పెళ్లికి ముందు బై

మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్‌తో డేటింగ్ నడిపి బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యాడు సుశాంత్. వీళ్లిద్దరూ తరచూ సీక్రెట్‌గా కలవడం.. కెమెరాల కంటికి చిక్కడంతో ఈ విషయం లీకైంది. అంతేకాదు, ఒకానొక సందర్భంలో తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామంటూ ఈ జంట బహిరంగంగానే చెప్పుకొచ్చింది. అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది.

 టాలీవుడ్ హీరోయిన్‌తో సుశాంత్ ప్రేమాయణం

టాలీవుడ్ హీరోయిన్‌తో సుశాంత్ ప్రేమాయణం

కృతి సనన్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. టాలీవుడ్ ద్వారా చిత్ర సీమకు పరిచయమైన రెహా చక్రవర్తితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈమె.. టాలీవుడ్ బడా నిర్మాత ఎమ్ఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘తూనీగా తూనీగా' అనే సినిమాతో కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఆ ఫొటోల వల్లే ఎఫైర్ బయటకు వచ్చింది

ఆ ఫొటోల వల్లే ఎఫైర్ బయటకు వచ్చింది

సుశాంత్ - రెహా చక్రవర్తి డేటింగ్ చేస్తున్న విషయం చాలా కాలం పాటు బయటకు రాలేదు. కానీ, ఓ సారి లండన్‌లో వీళ్లిద్దరూ కలిసి దర్శనమివ్వడం.. అదే సమయంలో రెహా పుట్టినరోజును అతడు దగ్గరుండి జరిపించడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ముంబైలోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో డేటింగ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

 ఓపెన్ అయిన సుశాంత్.. ముందుకెళ్తాడట

ఓపెన్ అయిన సుశాంత్.. ముందుకెళ్తాడట

ఈ బాలీవుడ్ కపుల్స్ గురించి తరచూ మీడియాలో ఏదో ఒక స్టోరీ వస్తూనే ఉంది. దీంతో సుశాంత్ సింగ్ కొద్ది రోజుల క్రితం తన ప్రేమ గురించి ఓపెన్ అయ్యాడు. అంతేకాదు, రెహా చక్రవర్తి గురించి మాట్లాడుతూ ‘మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అందుకే చాలా దగ్గరయ్యాం. అంంతేకాదు మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను' అని వెల్లడించాడు.

Recommended Video

Director SS Rajamouli Launched The Telugu Logo Of 'Brahmastra' | Filmibeat Telugu
బాలీవుడ్ హీరో ఇంట్లో టాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ హీరో ఇంట్లో టాలీవుడ్ హీరోయిన్

రెహా చక్రవర్తి... సుశాంత్ సింగ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ... కలిసి తిరగడానికీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా లాక్‌డౌన్ పిరియడ్ నడుస్తున్నప్పటికీ... సీక్రెట్‌గా కలుసుకున్నారని బీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. అది కూడా ముంబైలోని సుశాంత్ సొంత ఇంట్లోనే అని అంటున్నారు. దీంతో ఈ జంట మరోసారి హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X