మహేష్ భట్‌తో అక్రమ సంబంధం.. సుశాంత్ మరణంపై మొసలి కన్నీరా? రియాపై నెటిజన్ల ఫైర్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నెల రోజులు అవుతోంది. గత నెల (జూన్ 14) బాంద్రాలోని తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ప్రాణాలను తీసుకున్నాడని మొదటగా వార్తలు వచ్చినా.. వాటిని ఇప్పటికీ ఎవ్వరూ నమ్మడం లేదు. అది ఆత్మహత్య కాదనీ అందరూ వాదిస్తున్నారు. సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ఇప్పటికీ ప్రతీ రోజూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి.

మరణించి నెల రోజులు..
సుశాంత్ మరణించి నేటికి నెల రోజులు అవుతోంది. ఈ సందర్భంగా నెటిజన్లు సుశాంత్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అతని చావుకు కారణమైన వాళ్లను శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి చేసిన పోస్ట్ ఆగ్రహానికి గురి చేసింది.

రియా పోస్ట్ వైరల్..
సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూ రియా చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. ఇంకా ఆ బాధను మరిచిపోలేకపోతున్నానని, అసలైన ప్రేమ, నమ్మకం అంటే ఏంటో చూపించావని సుశాంత్‌పై ప్రేమను కురిపించింది. తిరిగి రావాలని కోరుకుంటున్నానని, మన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.

దేవుడి బిడ్డ..
అయితే అంకితా లోఖండే మాత్రం సింపుల్‌గా దేవుడి ముందు దీపం వెలిగింది. దేవుడి బిడ్డ అంటూ ఒకే ఒక్క కామెంట్ చేసింది. అయితే అంకిత చేసిన దాంట్లోనే ప్రేమ కనిపిస్తోందని, రియా ఫేక్ ఎమోషన్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. నేడు రియా చక్రవర్తి పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మహేష్ భట్‌తో..
మహేష్ భట్‌తో ఉన్న సంబంధం గురించి మొదట చెప్పమని ఒకరు, మహేష్ భట్ చెబితేనే ఇలా పోస్ట్ చేశావా? అని ఇంకొకరు ఆమెను ఆడుకున్నారు. అసలు సుశాంత్ గురించి మాట్లాడే అర్హతే లేదని ఏకిపారేశారు. ఒకప్పుడు మహేష్ భట్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. రియా పరువు తీస్తున్నారు.

మొసలి కన్నీరు..
సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదని, ఇప్పుడు మాత్రం గుర్తుకు వచ్చాడా? ఇన్ని రోజులు ఏమైందని నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. సుశాంత్‌పై మొసలి కన్నీరు కార్చకని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

సీబీఐ ఎంక్వైరీ..
సుశాంత్ మరణం వెనుక ఎన్నో కోణాలున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకురావాలని నెటిజన్లు, ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా కేసులో పురోగతి కనిపించడం లేదని అందరూ ఫైర్ అవుతున్నారు. వెంటనే సీబీఐ దర్యాప్తుకు అనుమతివ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











