twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకు! ఈడీ బట్టబయలు.. బిగుస్తున్న సీబీఐ ఉచ్చు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు చకచకా దూసుకుపోతున్నాయి. పాట్నాలో సుశాంత్ సింగ్ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దూకిన ఈడీ, సుప్రీం కోర్టు ఆదేశాలతో ముంబై చేరుకొన్న సీబీఐ అధికారులు తమదైన శైలిలో దర్యాప్తు కొరడా ఝులిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సుశాంత్ మరణంలో వాస్తవాలు బయటకు రాబట్టడానికి ముంబైలో సీబీఐ, ఈడీ అధికారులు భేటీ కావడం విశేషంగా మారింది. ఈ అధికారులు భేటీలో..

     ఎంత, ఎప్పుడు, ఎన్నిసార్లు అనే కోణంలో

    ఎంత, ఎప్పుడు, ఎన్నిసార్లు అనే కోణంలో

    సుశాంత్ సింగ్ కేసులో మాదక ద్రవ్యాల అంశం కొత్తగా వెలుగు చూడటం మీడియాలో ఆసక్తి రేపింది. రియా డ్రగ్స్ ఎందుకు కొన్నారు? ఎంత మొత్తం కొన్నారు? ఎంత ఎన్నిసార్లు కొన్నారు అనే విషయాలను చెప్పడానికి దర్యాప్తు సంస్థలు నిరాకరించినట్టు తెలిసింది. రియా డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ చర్చకు దారి తీసింది. రియాకు డ్రగ్స్‌ దందాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంది.

    బ్యాంక్, ఆర్థిక అంశాలపై నిశితంగా

    బ్యాంక్, ఆర్థిక అంశాలపై నిశితంగా

    సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఖాతాల గురించి ఆరా తీశాం. బ్యాంకు అధికారులు, రియా చక్రవర్తి నుంచి వివరాలు సేకరించాం. వాటిని దర్యాప్తు కోసం సీబీఐ అధికారులకు అందించాం. ఆర్థికపరమైన వ్యవహారాలపై ఇరు దర్యాప్తు సంస్థల అధికారుల మధ్య కొంత చర్చ జరిగింది అని ఈడీ అధికారులు చెప్పినట్టు రిపబ్లిక్ కథనంలో పేర్కొన్నది.

     రియా చక్రవర్తికి 24 ప్రశ్నలు

    రియా చక్రవర్తికి 24 ప్రశ్నలు

    గత రెండు మూడు రోజులుగా సిబీఐ అధికారులు సుశాంత్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే రియా చక్రవర్తిని సుదీర్గంగా చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24 రకాల ప్రశ్నలను సీబీఐ సిద్దం చేసినట్టు సమాచారం. అయితే ఈ కేసులో పలు కోణాల్లో విచారించడానికి పలుమార్లు రియాను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    మూడు రోజులుగా పితాని, నీరజ్ సింగ్‌లను

    మూడు రోజులుగా పితాని, నీరజ్ సింగ్‌లను

    గత మూడు రోజుల నుంచి సీబీఐ సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని, వంట మనిషి నీరజ్ సింగ్, దీపేష్ సావంత్‌ను ముంబైలోని డీఆర్డీడీవో గెస్ట్ హౌస్‌లో ప్రశ్నిస్తున్నారు. మంగళవారం కూడా ఈ వీరిని తమ అదుపులో ఉంచుకొని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు వీరిని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

    English summary
    ED shared Sushant Singh Rajput's case data to CBI in Mumbai. These two investigation official met in DRDO guest house for furthur course of action in this case. ED revealed that Rhea Chakraborty used narcotics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X