రియా చక్రవర్తి మరో వాట్సాప్ చాట్ లీక్.. సుశాంత్‌పై నిషేధిత డ్రగ్స్? డీలర్లతో దందాపై సీబీఐ నజర్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహారాలపై రోజు రోజుకు అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ వాడకం, డీలర్లతో సంప్రదింపులు జరిపారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఓ వాట్సప్ ఛాటింగ్ లీక్ కావడం సంచలనం రేపింది. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకంపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడమే కాకుండా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. లీకైన వాట్సప్ ఛాటింగ్ విషయాల్లోకి వెళితే..
Recommended Video

డ్రగ్ డీలర్‌తో రియా సంభాషణ
డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో జరిపిన వాట్సప్ సంభాషణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. నిషేధిత మిథైలెండిక్సీ మీతమ్‌ఫెటామైన్ అనే ప్రమాదకర డ్రగ్స్‌ను అడగడం ఈడీ అధికారులు దృష్టికి వచ్చింది. ఎక్కువ మోతాదు పవర్ ఉన్న డ్రగ్స్ గురించి సమాచారం కావాలి. అలాంటి డ్రగ్స్‌ను వాడలేదు అంటూ రియా చక్రవర్తి అడిగిన విషయం అధికారులు దృష్టికి వచ్చింది. ఈ ఛాటింగ్ 2017 మార్చిలో జరిగింది.

డ్రగ్స్ బాగా పనికి వచ్చాయా?
బాలీవుడ్‌లో చిన్నపాటి నటుడు జయ సాహాతో రియా చక్రవర్తి జరిపిన మరో వాట్సాప్ ఛాటింగ్ మీడియాకు చిక్కింది. శృతిని కోఆర్డినేట్ చేయమని అడిగాను. థ్యాంక్స్ సో మచ్ అంటూ రియా మెసేజ్ పంపింది. అందుకు సమాధానంగా నో ప్రాబ్లెం. డ్రగ్స్ బాగా పనికి వచ్చాయా? అంటూ ఓ మెసేజ్ పంపారు.

డ్రగ్స్ దందాలో రియా సోదరుడికి లింక్
సుశాంత్ ఇంటి సిబ్బంది శామ్యూల్ మిరాండాతో రియా చక్రవర్తి జరిపిన మరో మెసేజ్ మీడియాలో వైరల్ అవుతున్నది. హాయ్ రియా.. డ్రగ్స్ (స్టఫ్) ఏమి మిగల్లేవు అంటూ వారి మధ్య సంభాషణ జరిగింది. అయితే రియా సోదరుడు షోవిక్ స్నేహితుడిని నుంచి తీసుకోవచ్చా? మరో మరో విషయం వెలుగులోకి వచ్చింది.

ఊపందుకొన్న సీబీఐ విచారణ
సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని త్వరలోనే సీబీఐ విచారించే అవకాశం ఉంది. డ్రగ్స్, ఇతర విషయాల గురించి సీబీఐకి ఈడీ పలు వివరాలను మంగళవారం అందించింది. వాటర్‌స్టోన్ రిసార్టులో సుశాంత్‌కు అధ్యాత్మిక చికిత్స గురించి సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. పితాని, నీరజ్‌ను సీబీఐ అధికారులు గత మూడు రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నారు.


Click it and Unblock the Notifications











