భయంతో ఖరీదైన లాయర్‌ని సెట్ చేసుకున్న రియా.. ముందస్తు బెయిల్ కోసం ప్లాన్!

నెలరోజుల దాటినా ఇంకా సుశాంత్ సింగ్ మృతికి గల అసలు కారణాలు తెలియరాలేదు. కానీ రోజుకో అనుమానం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది. పోలీసుల విచారణలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక మొన్నటివరకు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కేసుతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ మంగళవారం సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ కేసు నమోదు చేయడంతో సరికొత్త సంచలనానికి దారి తీసింది. దీంతో రియాలో భయం కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది.

ఫైట్ చేయడానికి సిద్దమైన రియా

ఫైట్ చేయడానికి సిద్దమైన రియా

ఈ కేసు వివాదం నుంచి బయటపడటానికి రియా ఫైట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ తండ్రి మంగళవారం పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తన కొడుకు సూసైడ్ చేసుకోవడానికి ఆమె కూడా ఒక కారణమని పిర్యాదు చెయడంతో రియా న్యాయపరమైన విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.

రియాలో పెరిగిన భయం..

రియాలో పెరిగిన భయం..

అయితే కేసు విషయంలో ముందు జాగ్రత్తగా రియా కొన్ని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ తండ్రి FIR నమోదు చెయడంతో కేసును అధికారులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేవలం రియాపైనే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో రియాలో భయం కూడా ఎక్కువైనట్లు టాక్ వస్తోంది.

ఖరీదైన లాయర్ తో చర్చలు..

ఖరీదైన లాయర్ తో చర్చలు..

ఈ కేసు సీరియస్ గా మరే అవకాశం ఉందని గ్రహించిన రియా చక్రవర్తి ముందుగానే ఒక ఖరీదైన లాయర్ ని సెట్ చేసుకుంది. టాప్ క్రిమినల్ లాయర్ సతీష్ మనిషిండేను తన వైపున వాదించడానికి ఏర్పాటు చేసుకుంది. సుశాంత్ తండ్రి బీహార్ లో కేసు నమోదు చేశాడని తెలియగానే రియా ముందు జాగ్రత్తగా తన లాయర్ కి సమాచారాన్ని అందించింది.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
మూడుగంటల పాటు చర్చలు

మూడుగంటల పాటు చర్చలు

మంగళవారం సాయంత్రమే సతీష్ దగ్గర పని చేస్తున్న మరో క్రిమినల్ లాయర్ ఆనంది ఫెర్నాండెజ్ రియాను కలిశారు. ఇంట్లోనే దాదాపు మూడు గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముందస్తు బెయిల్ కోసం కూడా లాయర్ తో రియా చర్చించినట్లు సమాచారం. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధమని నిరూపించడానికి రియా చక్రవర్తి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి కోర్టు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X