రియా ఓ జిత్తులమారి - సుశాంత్ ఫ్యామిలీ లాయర్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక రియా హస్తముందని, అతడి తండ్రి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దగ్గర నుంచీ, ఆమెపై ఆ కుటుంబం రోజుకొక నిందారోపణ చేస్తూనే ఉంది. తాజాగా వారి న్యాయవాది వికాస్ సింగ్ మీడియా ముందుకు వచ్చి, రియా సుశాంత్ నుంచి అతడి అక్కను వేరు చేసిన వైనాన్ని వివరించాడు.
గతంలో ఓ సారి సుశాంత్ అక్క ప్రియాంకను తన అన్న పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించిన రియా, అక్కడ ఆమె తనపై దాడి చేసిందని సుశాంత్ కు తెలిపిందని, దీంతో సుశాంత్ తన అక్కపై కోపగించుకున్నాడని వికాస్ తెలిపాడు. ఇదే విషయమై సుశాంత్, అతడి అక్క ప్రియాంకకు గొడవ జరిగగా, అక్కా తమ్ముడు కొన్ని నెలలపాటూ మాట్లాడుకోలేదని వివరించాడు.

కొన్నాళ్లకు రియా చెప్పినదంతా అబద్ధమని తెలుసుకున్న సుశాంత్, అక్కకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని తెలిపాడు. అంతేకాకుండా, అక్కలను పిలిపించి, రియాను నిలదీశాడని, అప్పుడే ఆమె తమ కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నట్లు సుశాంత్ గుర్తించాడని లాయర్ వికాస్ వెల్లడించాడు. సుశాంత్, తన అక్క ప్రియాంకతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండటం జీర్ణించుకోలేకే రియా ఈ పనికి ఒడిగట్టిందని లాయర్ వికాస్ స్పష్టం చేశాడు.
sushanth singh rajput rhea chakraborthy family lawyer vikas singh sister priyanka సుశాంత్ సింగ్ రాజ్ పుత్ రియా చక్రవర్తి ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ప్రియాంకా సింగ్


Click it and Unblock the Notifications