యంగ్ హీరోయిన్ ఫ్రీ హగ్స్.. రోడ్డునపోయే వారిని పిలిచిమరీ కౌగిలించుకుంటున్న బ్యూటీ! భలే ఆఫర్.
Recommended Video
నేటితరం యంగ్ హీరోయిన్స్ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటున్నాయి. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో పాటు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా హీరోయిన్ రిచా చద్దా కౌగిలింతల్లో మునిగిపోయి దాన్ని సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

పిలిచిమరీ రెచ్చిపోతున్న హీరోయిన్.. ఫ్రీ కౌగిలింత
అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఓ లేడీ పిలిచిమరీ కౌగిలింతలు ఇస్తే ఎవ్వరు మాత్రం వద్దంటారు చెప్పండి. అది కూడా ఓ హీరోయిన్ కౌగిలింత అంటే ఇక ఏకంగా క్యూ కట్టేస్తారు. అలాంటి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది బాలీవుడ్ భామ రిచా చద్దా.

స్పెషల్ డే.. మరింత స్పెషల్‌గా మార్చుతూ
జనవరి 21వ తేదీకి ఓ స్పెషలిటీ ఉంది. ఆ రోజు అంతర్జాతీయ కౌగిలంతల దినోత్సవం. ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్‌గా మార్చేసింది రిచా. వినూత్న పద్దతికి శ్రీకారం చుడుతూ అందరినీ కౌగిలింతల్లో ముంచెత్తింది. అపరిచితులుకు కౌగిలింతలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఫ్రీ హగ్స్ అంటూ బోర్డు పెట్టుకొని మరీ
ముంబై లోని ఓ వీధిలో రిచా చద్దా ఈ కౌగిలింతల కార్యక్రమం చేపట్టింది. చేతిలో ఫ్రీ హగ్స్ అనే ఫ్లకార్డు పట్టుకొని మరీ దారిలో వెళుతున్న చాలా మందిని పిలిచి కౌగిలించుకుంది. పైగా ఈ హగ్స్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రిచా.

ఇప్పుడు మిస్ అయినా.. మళ్ళీ అవకాశం
''ఈ ప్రపంచంలో ద్వేషం ఎక్కువగా ఉంది. అందుకే ప్రేమతో దాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో ఈ కౌగిలింతలు ఇస్తున్నా. ఇక ప్రతి యేడాది ఇలాగే చేస్తా.. ఈ యేడాది నన్ను హగ్ చేసుకోని వాళ్లు వచ్చే యేడాది జనవరి 21న అంతర్జాతీయ కౌగిలింతల దినోత్సవం రోజున కలవొచ్చు'' అని పేర్కొంటూ మరింత ఆశ్చర్యపరిచింది ఈ యంగ్ హీరోయిన్.
షకీలా బయోపిక్.. జనాల్లో హాట్ టాపిక్
ప్రస్తుతం ‘షకీలా' బయోపిక్ మూవీ చేస్తోంది రిచా చద్దా. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ప్రేక్షకలోకం ఆతృతగా ఎదురు చూస్తోంది. షకీలా నటించేందుకు గాను, ఆమెను స్వయంగా కూడా కలిసి వివరాలు తెలుసుకుంది రిచా. మొత్తానికి రిచా చేసిన కౌగిలింతల వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











