Richa Chadha Wedding:పెళ్లి పీటలు ఎక్కనున్న సెలబ్రిటీ జంట.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్

సాధారణంగా సినీ సెలబ్రిటీల పెళ్లి వార్తలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఇక సోషల్ మీడియా వచ్చాక వాటిపై క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లి తేది నుంచి వారి ఆభరణాలు, దుస్తులు, వివాహ వేదికలు, ఖర్చు తదితర విషయాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు, నెటిజన్లు తెగ ఆసక్తిక కనబరుస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి సెలబ్రిటీ జంటలు. ఆ మధ్య విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్, రాజ్ కుమార్ రావు-పత్రలేఖ, ఈ మధ్యే రణ్ బీర్ కపూర్-అలియా భట్ వివాహం వార్తలు ఎంత హాట్ టాపిక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు తాజాగా మరో సెలబ్రిటీ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది.

 గుడ్డు భయ్యా అంటే మాత్రం..

గుడ్డు భయ్యా అంటే మాత్రం..

బాలీవుడ్ యాక్టర్ అలీ ఫజల్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ మీర్జాపూర్ గుడ్డు భయ్యా అంటే మాత్రం చాలా మందికి తెలుసు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు అలీ ఫజల్. అంతేకాకుండా ఏకంగా హాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టాడు ఈ హీరో.

 హాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో..

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో..

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ నటించిన డెత్ ఆన్ ది నీల్ అనే చిత్రంలో నటించాడు అలీ ఫజల్. త్వరలో ఈ నటుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దాను పెళ్లాడబోతున్నాడు. షకీలా సినిమాతో హిందీతోపాటు తెలుగులోనూ రచ్చ చేసింది ఈ బ్యూటి. అలాగే ఇటీవల విడుదలైన ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ తో చాలా బాగా పాపులర్ అయింది ఈ హాట్ గుమ్మ.

తొమ్మిదేళ్లుగా డేటింగ్..

తొమ్మిదేళ్లుగా డేటింగ్..

అలీ ఫజల్, రిచా చద్దా గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కరోనా సమయంలోనే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. అప్పుడే పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ముందుగా వీరి పెళ్లిని 2022 అక్టోబర్ 6న జరగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత తేది మారిందని అధికారికంగా ప్రకటించింది ఈ జంట.

ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో..

ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో..

ఒక పోస్ట్ ద్వారా వారి పెళ్లి తేదిని ప్రకటించారు అలీ ఫజల్, రిచా చద్దా. ఒక చిన్న అగ్గిపెట్టె లాంటి కార్డుపైన ఈ జంట సైకిల్ తొక్కుతున్న ఫొటోను ప్రింట్ చేయించి కింద వెడ్డింగ్ డేట్ ను తెలిపారు. అక్టోబర్ 4న వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి బాలీవుడ్ అతిరథులు హాజరుకానున్నారట.

 సెప్టెంబర్ 30 నుంచి ప్రీ వెడ్డింగ్ పనులు..

సెప్టెంబర్ 30 నుంచి ప్రీ వెడ్డింగ్ పనులు..

అయితే పెళ్లి డేట్ ప్రకటించినప్పుడే సెప్టెంబర్ 30 నుంచి ప్రీ వెడ్డింగ్ పనులు మొదలు కానున్నట్లు సమాచారం వచ్చింది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే వారి ప్రీ వెడ్డింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను రిచా చద్దా తాజాగా షేర్ చేసింది. బ్యూటిఫుల్ ఔట్ ఫిట్ లో ఒకరినొకరు చూసుకుంటూ అందంగా పోజులు ఇచ్చింది ఈ జంట.

 2017లో అధికారికంగా

2017లో అధికారికంగా

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలతోపాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే 2015 నుంచి డేటింగ్ లో ఉన్న రిచా చద్దా, అలీ ఫజల్ 2017లో అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ కలిసి ఫక్రే 3 చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X