‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ ట్రైలర్.. అదరగొట్టేసిన రిచా చద్దా

బాలీవుడ్ టాలెంటెడ్ నటి రీచా చద్దా మెయిన్ లీడ్‌గా వస్తోన్న చిత్రం మేడమ్ చీఫ్ మినిస్టర్. ఓ సాధారణ యువతి.. రాజకీయాల్లోకి రావడం, పార్టీలో ముఖ్యనేతగా మారడం, చివరకు సీఎంగా రాష్ట్రాన్ని పాలించడం వంటి అద్భుతమైన ఘట్టాలను చూపించేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. అయితే రిచా చద్ద నటనే ఈ సినిమా మెయిన్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్రంలో జరిగే పొలిటికల్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కించారు.

ఇందులో హీరోయిన్‌గా నటించిన రీచా చద్దా పాత్ర తీరు తెన్నులు మాత్రం మాయావతిలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా అక్కడి రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీసినట్టుగా అనిపిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో రాజకీయమంటే చదరంగం ఆట అని చెప్పకనే చెప్పేశారు. పార్టీలో చేరి, పార్టీ ఇమేజ్ మొత్తానికి తన గుప్పట్లోకి తెచ్చుకోవడాన్నీ సీనియర్ నాయకులు జీర్ణించుకోకపోవడం బలమైన ప్రతినాయకులుగా మారడంతో కథ ఆసక్తిరంగా మారినట్టు కనిపిస్తోంది.

Richa chadha Madam Chief minister Trailer Out

హత్యా రాజకీయాలు, కుళ్లు కుతంత్రాలతో నిండిపోయినట్టుగా చూపించిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంటరాని తనానికి వ్యతిరేకంగా గళమెత్తే సినిమా అంటూ రిచా చద్దా చెప్పుకొచ్చింది. ఈ చిత్రం జనవరి 22న విడుదల కాబోతోంది. ఈ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మించింది. భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించగా.. సుభాష్ కపూర్ తెరకెక్కించాడు. ఇందులో సౌరభ్ శుక్లా, మనావ్ కౌల్, అక్షయ్ ఒబేరాయ్ వంటివారు ముఖ్య పాత్రలనుపోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X