పాయల్ ఘోష్‌కు రిచా చద్దా షాక్.. అనురాగ్ కశ్యప్ వివాదంపై లీగల్ నోటీసులు
బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం వేడెక్కుతున్నది. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో హిందీ చిత్ర పరిశ్రమలో కలకలం రేగుతున్నది. ఈ వివాదంలో తన పేరును పాయల్ ఘోష్ లాగడంపై హిందీ నటి రిచా చద్దా తీవ్రంగా స్పందించారు. తనను ఈ వివాదంలోకి లాగి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారనే ఆరోపణలపై రిచా చద్దా తన లాయర్ చేత నోటీసు జారీ చేయించారు. తన లాయర్ విడుదల చేసిన నోటీసును రిచా చద్దా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
రిచా లాయర్ సవీనా బేడీ సచర్ విడుదల చేసిన నోటీసు ప్రకారం.. ఇటీవల ఓ దర్శకుడిపై లైంగిక దాడి ఆరోపణలు చేస్తూ నా క్లయింట్ రిచా చద్దా పేరును అనవసరంగా వివాదంలోకి లాగారు. ఎవరైనా మహిళకు అన్యాయం జరిగితే వారికి న్యాయం తప్పక లభించాలనే భావనతో నా క్లయింట్ ఉన్నారు. పని ప్రదేశంలో సమానంగా హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని గౌరవిస్తారు. పని ప్రదేశాల్లో మహిళల హక్కులు, గౌరవానికి భంగం కలిగించవద్దనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తారు అని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏ మహిళనైనా తన హక్కులను, స్వేచ్ఛను దుర్వినియోగం చేయవద్దు. మరో మహిళలపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేయవద్దు. ఈ వివాదంలో నా క్లయింట్‌ను లాగిన నేపథ్యంలో ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన నేపథ్యంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు అని రిచా చద్దా లాయర్ సవీనా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 19వ తేదీ రాత్రి తెలుగు టెలివిజన్ ఛానెల్ ఏబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. తన రూమ్‌కు పిలిచి తనతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











