షకీలా బయోపిక్.. ఛాన్స్ కొట్టేసిన సెక్సీ హీరోయిన్!
ప్రస్తుతం అన్ని చిత్రపరిశ్రమలో బయోపిక్స్ కాలం నడుస్తోంది. బయోపిక్ చిత్రాలుపై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. శృంగార తారగా దక్షిణాదిలో సంచలనం సృష్టించిన షకీలా జీవిత చరిత్రని వెండి తెరపై ఆవిష్కరించడానికి రంగం సిద్ధం అవుతోంది.
దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఈ ఆసక్తికరమైన బయోపిక్ ని తెరకెక్కించే భాద్యతలు స్వీకరించారు. చాలా రోజుల క్రితమే షకీలా బయోపిక్ ప్రస్తావన వచ్చింది. షకీలా పాత్రలో ఒదిగిపోయి నటించే హీరోయిన్ కోసం ఇప్పటి వరకు వెతుకుతున్నారు. పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లని పరిశీలించిన తరువాత హాట్ హీరోయిన్ రిచా చద్దాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రిచా చద్దా అందాల అరబోయడంతో పాటు నటనలో సైతం అదరగొట్టే ప్రతిభ ఉన్న నటి. షకీలా పాత్రకు రిచా చద్దా వందశాతం న్యాయం చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హ్యూమా క్యురేషి, స్వరభాస్కర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించిన తరువాత రిచా చద్దా వైపు దర్శకుడు మొగ్గు చూపాడు. త్వరలోనే షకీలా బయోపిక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











