జిమ్‌లో టాలీవుడ్ హీరోయిన్ కు టోకరా.. ఏకంగా 4 కోట్లు కొట్టేసిన కేటుగాడు.. అసలు ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో కేటుగాళ్లు రకరకాల దారుల్లో మోసానికి పాల్పడుతున్నారు. సామాన్య జనం ఎంత ఈజీగా మోసపోతున్నారో సెలబ్రిటీలు కూడా అంతే స్థాయిలో మోసపుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మోసపోగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు సినిమాలో నటించిన రిమి సేన్ ఇప్పుడు మోసపోయి పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళితే

 సినిమాలకు దూరంగా

సినిమాలకు దూరంగా


కలకత్తాలో పుట్టి పెరిగిన రిమి సేన్ మొదట బెంగాలీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె ఇదే నా మొదటి ప్రేమ లేఖ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ఆమె అందరివాడు సినిమాలో చిరు సరసన నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఆ సినిమాతో ఇక కనిపించడం మానేసింది. కానీ హిందీలో 2016 దాకా సినిమాలు చేసింది. 2015 బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

 జిమ్‌లో

జిమ్‌లో


అయితే ఆమె ఒక పెద్ద మోసానికి గురైంది. ఓ వ్యాపారి మొత్తం 4.14 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడు. ఆమె ముంబైలోని ఖర్ (వెస్ట్) పోలీస్ స్టేషన్ లో మార్చి 29న రిమీ సేన్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్లో తన అసలు పేరు శుభ మిత్ర సేన్ అని "నాకు 2019లో జిమ్‌లో రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, మా మధ్య స్నేహం పెరిగిందని పేర్కొంది.

కంపెనీ స్టార్ట్ చేయడం లేదని

కంపెనీ స్టార్ట్ చేయడం లేదని


తన కుటుంబం కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఫ్లెమింగో బీవరేజెస్ కంపెనీలో పెట్టుబడి పెడితే... 30 నుంచి 40 శాతం వడ్డీ ఇస్తానని చెప్పాడని అయితే తాను డబ్బులు ఇచ్చిన కొన్ని రోజులకు అతడు ఎటువంటి కంపెనీ స్టార్ట్ చేయడం లేదని తెలిసింది" అని రిమీ సేన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. తనను మోసం చేసిన రౌనక్ జతిన్ వ్యాస్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

పలు సెక్షన్ల కింద కేసు

పలు సెక్షన్ల కింద కేసు


రిమీ చెబుతున్న దాని ప్రకారం, ఫిబ్రవరి 2019 మరియు నవంబర్ 2020 మధ్య, ఆమె వ్యాస్‌కు మొత్తం రూ.4.14 కోట్లు ఇచ్చారు. అయితే, నటి అతనిని డబ్బు అడగడంతో, నిందితుడు అతని కాల్స్ కి సమాధానం ఇవ్వడం మానేశాడు. నిందితుడు తన డబ్బుతో ఎలాంటి వ్యాపారం ప్రారంభించలేదని, ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేశాడని తెలుసుకున్న నటి షాక్‌కు గురైంది. దీంతో ఆమె సహాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం విచారణ అనంతరం పోలీసులు రోనక్‌పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
 నిర్మాతగా

నిర్మాతగా


ఐపీసీ 406, ఐపీసీ 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించినట్లు ఖార్ పోలీసులు తెలిపారు. రిమీ సేన్ హిందీలో 'ధూమ్', 'హంగామా', 'బాగ్బన్', 'గరమ్ మసాలా', 'క్యూన్ కి', 'ఫిర్ హేరా ఫేరీ' మరియు 'గోల్‌మాల్' వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అలాగే ఆమె హిందీ చిత్రాలే కాకుండా తెలుగు, బెంగాలీ చిత్రాలలో కూడా నటించింది. నటిగా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆమె నిర్మాతగా మారారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X