రిషికపూర్‌ కోసం అలియాభట్ కంటతడి పెట్టించే లేఖ.. కాబోయే మామ గురించి భావోద్వేగం

బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ ఆకస్మిక మరణంతో సినీ లోకం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. ఆయన లేరనే వార్త తెలిసిన వెంటనే విషాదంలో మునిగిపోయారు. ఆయన మ‌ృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో శ్రద్దాంజలి ఘటించారు. తాజాగా రిషికి కాబోయే కోడలుగా ప్రచారమవుతున్న బాలీవుడ్ నటి అలియాభట్ భావోద్వేగమైన లేఖను రాశారు. గత రెండేళ్లలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా పంచుకొన్నారు. అలియా రాసిన లేఖ పూర్తి వివరాలు ఇవే..

Recommended Video

Rishi Kapoor Last Rites : Alia Bhatt Teary Eyed, Writes Emotional Letter For Father In Law..
నా జీవితంలో ఎనలేని ప్రేమను పంచి

నా జీవితంలో ఎనలేని ప్రేమను పంచి

రిషికపూర్ గారు నా జీవితంలో ప్రేమను, మంచిని తీసుకొచ్చిన గొప్ప, అందమైన మనసున్న వ్యక్తి. నాకు ఇప్పుడే కాదు.. గతంలో ఎప్పట నుంచే పరిచయం ఉంది. ఆయన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. గత రెండేళ్లుగా ఆయనతో పరిచయం మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఆయన ఓ స్నేహితుడిగా, ఛైనీస్ ఫుడ్ లవర్‌గా మరింత దగ్గరకు చేర్చించింది అని అలియాభట్ తన లేఖలో తెలిపారు.

గొప్ప ఫైటర్, లీడర్

గొప్ప ఫైటర్, లీడర్

రిషికపూర్ సినిమా తప్ప మరో లోకం తెలియదు. ఎదైనా సమస్య ఎదురైతే దానిని ఎదురించే ఫైటర్, గొప్ప నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి. అంతేకాకుండా మంచి కథకుడు. అంతేకాకుండా మంచి ట్విట్టర్. ఇవన్నీ పక్కన పెడితే గొప్ప తండ్రి. గత రెండేళ్లలో నాకు లభించిన ప్రేమ, ఆప్యాయత మాటల్లో చెప్పలేను. ఆయన నుంచి పొందిన కౌగిలింతలో ప్రేమను నిర్వచించలేం అని అలియా భట్ లేఖలో పేర్కొన్నారు.

ఆయనతో అనుబంధం మాటల్లో చెప్పలేను

రిషికపూర్‌లో మరో కోణం చూసే అవకాశం ఇచ్చిన ఈ ప్రకృతికి, ప్రపంచానికి చాలా రుణపడి ఉంటాను. ఆయనతో మధురస్మృతులు వెంటాడుతూనే ఉంటాయి. ఆయన కుటుంబంలో నేనొక భాగస్వామిగా మారానంటే ఆయన ప్రేమానురాగాలే. ఆయన చూపించే ఆదరణను, ప్రేమను ఎప్పటికీ మరువలేను. మీరు దూరమైనప్పటికీ.. ఎప్పుడూ మా మనసులో ఉంటారు. మీరు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని అలియాభట్ తెలిపారు.

రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో

రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో


గత రెండేళ్ల నుంచి రిషి కపూర్ కుమారుడు, సినీ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అలియాభట్ అఫైర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్, అలియాభట్ పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరిగింది. కానీ రిషి అనారోగ్య కారణంగా వాయిదా పడిందనే వార్తలు కూడా మీడియాలో వెలుగు చూశాయి.

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి

లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రిషికపూర్ గురువారం (ఎఫ్రిల్ 30వ0 తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ముంబైలోని ఓ శ్మశాన వాటికలో మధ్యాహ్నం పూర్తయ్యాయి. ఆయన అంత్యక్రియలకు అలియాభట్‌తోపాటు కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా, రిషి కపూర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో ఆలియా భట్ స్వయంగా ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X