క్యాన్సర్‌తో పోరాడి 11 నెలల తర్వాత తిరిగి వచ్చిన రిషీ కపూర్!
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత యువ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కూడా క్యాన్సర్ బారిన పడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 11 నెలలుగా ఆయన అమెరికాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.
ఎట్టకేలకు రిషి కపూర్ తన భార్య నీతూ కపూర్‌తో కలిసి మంగళవారం తెల్లవారుజామున ఇండియాలో అడుగుపెట్టారు. ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిషి కపూర్ చికిత్స పొందుతున్నప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అమెరికా వెళ్లి ఆయన్ను పరామర్శించారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకోన్, ప్రియాంకా చొప్రా, వికి కౌశల్, అనిల్, టీనా అంబానీ తదితరులు ఆయన్ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

ముంబై విమానాశ్రయంలో బయటకు వస్తుండగా తీసిన రిషి కపూర్ ఫోటోలు చూస్తుంటే ఆయన చాలా హెల్దీగా, ఫిట్‌గా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పక్కనే భార్య నీతూ కపూర్ చాలా హ్యాపీ మూడ్లో కనిపించారు. వీరిని చూస్తుంటే రిషి కపూర్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టమవుతోంది.
రిషి ఆల్-డెనిమ్ వేషధారణలో కనిపించగా, నీతు బ్లాక్ టాప్ ధరించి నీలిరంగు డెనిమ్ ప్యాంటుతో దర్శనమిచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే రిషి కపూర్ ట్విట్టర్ ద్వారా ఐయామ్ బ్యాక్ అంటూ సందేశం పోస్ట్ చేశారు. ''ఇంటికి తిరిగి వచ్చాను. 11 నెలలు 11 రోజులు! అందరికీ ధన్యవాదాలు!" అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











