మరణానికి ముందు.. అభిమాని పాటకు రిషికపూర్ ఫిదా.. లెజెండ్ ఏం చేశారో తెలుసా?

బాలీవుడ్ నటుడు రిషికపూర్ క్యాన్సర్ వ్యాధిని ఎదిరిస్తూ చివరి వరకు మృత్యువుతో ధైర్యంగా పోరాడారు. హాస్పిటల్‌లో అభిమాని అయిన డాక్టర్‌తో ఉత్సాహంగా గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్‌గా మారింది. హాస్పిటల్ బెడ్‌పై రిషికపూర్ ఉండగా.. ఓ డాక్టర్ పాట పడగా ఫిదా అయ్యారు. అతడికి దీవెనలు అందించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియో గురించి..

Recommended Video

Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu

డాక్టర్‌కు దీవెనలు అందించి

హాస్పిటల్‌లో రిషికపూర్‌ బెడ్‌పై ఉండగా ఆయన నటించిన ఓ సినిమాలోని పాటను డాక్టర్ పాడారు. ఆ పాట విన్న తర్వాత రిషి చాలా ఆనందంగా డాక్టర్‌కు దీవెనలు అందించారు. జీవితంలో సక్సెస్ కావాలంటే కష్టం పడాల్సిందే. ప్రతి నిత్యం సాధన చేయాల్సిందే. అప్పుడే విజయం నీ వెంట వస్తుంది. లక్ అనేది కొద్ది మేరకే వెంట ఉంటుంది అంటూ తన అభిమానికి రిషి చెప్పడం వీడియోలో కనిపించింది.

ఆకస్మిక మరణంతో విషాదం

ఆకస్మిక మరణంతో విషాదం

అలా అభిమానితో గడిపిన కొద్ది గంటల తర్వాత రిషి కపూర్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రిషి ఆరోగ్యం విషమించడంతో ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రిషి మరణించడం లక్షలాది మంది అభిమానులు, స్నేహితులను, సన్నిహితులను కలిచివేసింది.

అంత్యక్రియలకు ఏర్పాట్లు

అంత్యక్రియలకు ఏర్పాట్లు

తాజాగా రిషికపూర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కొందరు ఆయన నివాసానికి చేరుకొన్నారు. ఇప్పటికే సైఫ్ ఆలీ ఖాన్ అక్కడికి చేరుకొన్నట్టు సమాచారం. కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు ముగిసే అవకాశం ఉంది.

ఢిల్లీ నుంచి ముంబైకి కూతురు

ఢిల్లీ నుంచి ముంబైకి కూతురు

రిషి కపూర్‌కు భార్య నీతూ సింగ్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, కూతురు రిద్ది కపూర్ ఉన్నారు. తండ్రి మరణించే సమయానికి రిద్ది ఢిల్లీలో ఉన్నారు. ఆమె ప్రత్యేక అనుమతితో రిషి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరారు. రిషికి కన్నీటి వీడ్కోలు తెలిపేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా వారు ఈ విషాద ఘట్టానికి దూరంగా ఉంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X