నాన్నకు ప్రేమతో: రిషి కూతురుకు దక్కని చివరిచూపు.. అంత్యక్రియల్లో సెలబ్రిటీల జాబితా ఇదే

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ లుకేమియా వ్యాధితో బాధపడుతూ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. రిషి చివరి క్షణాల్లో తన కూతురు తప్ప అందరూ ఆయన వెంట ఉన్నారు. కూతురు రిద్దిమా కపూర్ సాహ్ని ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తండ్రి మరణ వార్త వినగానే రిద్ధిమా తీవ్ర దిగ్రాంతికి లోనయ్యారు. విషాద సమయంలో తండ్రిని గుర్తు చేసుకొని రిద్ది భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

కూతురు ఎమోషనల్ పోస్టు

కూతురు ఎమోషనల్ పోస్టు

నాన్న.. ఐ లవ్ యూ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. గొప్ప పోరాట యోధుడి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇక నుంచి ప్రతీ రోజు నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. ప్రతీ రోజు ఫోన్ చేస్తే నవ్వుతూ పలకరించే నీ ముఖం ఇక కనిపించిందనే విషయం నన్ను ఇంకా బాధిస్తున్నది. మళ్లీ నిన్ను కలిసే వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను అని రిద్దిమా కపూర్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దాంతోపాటు తన తండ్రితో కలిసి తీయించుకొన్న సెల్ఫీని పోస్టు చేశారు.

తండ్రి అంత్యక్రియలకు హాజరుకాని కూతురు

తండ్రి అంత్యక్రియలకు హాజరుకాని కూతురు

తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిద్దిమా ఢిల్లీ పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు. ఢిల్లీ నుంచి ముంబైకి రోడ్డు మార్గం ద్వారా సుమారు 18 గంటలు ప్రయాణించాల్సి ఉన్నందున ఆమె అంత్యక్రియలకు అందుకోలేకపోయారు. విషాద ఛాయల మధ్య రిషి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతోపాటు కొందరు సన్నిహితులకు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు.

అంత్యక్రియలకు సెలబ్రిటీల జాబితా

అంత్యక్రియలకు సెలబ్రిటీల జాబితా

రిషి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముంబై పోలీసులు కొంత మందికి అనుమతి ఇచ్చారు. మీడియాకు చిక్కిన అనుమతి లేఖ ప్రకారం.. భార్య నీతూ కపూర్, సోదరి రిమాజైన్ దంపతులు (భర్త మనోజ్ జైన్, కుమారుడు ఆర్మాన్, ఆధార్ జైన్), అన్నిస్సా జైన్, రషి సోదరులు రాజీవ్ కపూర్, రణధీర్ కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్, భీమల్ పరేఖ్, నటాషా నందన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్, రిషి వ్యక్తిగత డాక్టర్ తరంగ్, ఆలియాభట్, దర్శకుడు ఆర్యన్ ముఖర్జీ, అనంత్ అంబానీ, రిషి స్నేహితుడు రాహుల్ రావైల్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అధికారికంగా ప్రకటన

అధికారికంగా ప్రకటన

రిషి కపూర్ మరణించారనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఉదయం లేఖను విడుదల చేశారు. మన అందరి ప్రియతమ నటుడు రిషి కపూర్ ప్రశాంతంగా శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు. లుకేమియాతో దాదాపు రెండేళ్ల అవిశ్రాంత పోరాటం తర్వాత గురువారం ఉదయం 8.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. చివరి వరకు రిషి కపూర్ డాక్లర్లు, మెడికల్ సిబ్బందితో ఉత్సాహంగా, ఆనందంగా గడిపారు. తన ఫిలాసఫీ ప్రకారం చివరి వరకు ఆయనతో సంతోష క్షణాలు ఉన్నాయి అని ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X