రిషి కపూర్ కష్టాల్లో ఉంటే అంబానీ కుటుంబం అలా.. నీతూ సింగ్ ఎమోషనల్ లేఖ

అలనాటి రొమాంటిక్ హీరో రిషి కపూర్ తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ ఆరాధ్య నటుడు ఇకలేరనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకొంటూ ఆ విషాదం నుంచి బయటపడుతున్నారు. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకొని రిషికపూర్ క్యాన్సర్‌ వ్యాధికి సహకరించిన ప్రతీ ఒక్కరికి ఆయన భార్య నీతూ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా దేశంలోనే పారిశ్రామిక దిగ్గజం అంబానీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నీతూ సింగ్ ఏం చెప్పారంటే..

రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడితే

రిషి కపూర్ క్యాన్సర్ బారిన పడితే

రిషికపూర్ ప్రాణాంతక వ్యాధికి గురై కష్టాల్లో ఉన్నప్పుడు అభిమానులు, సన్నిహితులు మా వెంట నడించారు. మాకు నైతిక బలాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించారు. ఊహించని విధంగా రిషి కపూర్ మమల్ని, ఈ లోకాన్ని వీడి విషాదాన్ని మిగిల్చారు. ఈ కష్టకాలంలో మాకు తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికి మా కుటుంబ తరపున నా కుమారుడు రణ్‌బీర్ కపూర్, రిద్ధిమా కపూర్, కపూర్ ఫ్యామిలీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అని నీతూ సింగ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

ముఖేష్ అంబానీలకు థ్యాంక్స్

ముఖేష్ అంబానీలకు థ్యాంక్స్

నీతూ సింగ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెడుతూ.. క్యాన్సర్‌తో పోరాడుతున్న నా భర్తకు నైతిక మద్దతును ఇచ్చిన ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి రుణపడి ఉంటాం. రిషికపూర్ అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతుంటే అంబానీ కుటుంబం అందించిన సహకారం మరువలేనిది. వారి సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.

రెండేళ్ల కష్టకాలంలో

రెండేళ్ల కష్టకాలంలో

రిషికపూర్ క్యాన్సర్ బారిన పడిన తర్వాత గత రెండేళ్లు మా ప్రయాణం చాలా కష్టంగా సాగింది. ఆ సమయంలో కొన్ని మంచి రోజులు ఉన్నాయి.. మరికొన్ని విషాద రోజులు కూడా మాకు ఎదురయ్యాయి. ఆ సమయంలో అంబానీ ఫ్యామిలీ మాకు సపోర్ట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఊహించని విధంగా ఉండేది అని నీతూ సింగ్ తన పోస్టులో పేర్కొన్నారు.

Recommended Video

Ranbir Kapoor Gets Emotional At Rishi Kapoor Prayers Meet
వ్యక్తిగతం హాస్పిటల్‌కు వచ్చి

వ్యక్తిగతం హాస్పిటల్‌కు వచ్చి

రిషి కపూర్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో అంబానీ కుటుంబ సభ్యులు వ్యక్తిగతం వచ్చి పరామర్శించారు. రిషికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. ఆయనపై ఎనలేని ప్రేమ, ఆదరణ కురిపించారు. వారు చూపించి ఆప్యాయత వల్ల మాకు ఎనలేని ధైర్యం వచ్చింది. మాకు భయాందోళనల గురైతే మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకు ముఖేష్ బాయ్, నితా బాబీ, ఆకాష్, శ్లోకా, అనంత్, ఇషాలకు మా ధన్యవాదాలు అంటూ నీతా ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X