చివరి క్షణాల్లోనూ అలాగే.. డాక్టర్లు, మెడికల్ స్టాఫ్‌ను నవ్వించిన రిషి కపూర్.. బంధువుల ప్రకటన

బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో రిషి కపూర్ నేడు (ఏప్రిల్ 30) మరణించారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. లుకేమియా అనే క్యాన్సర్‌తో పోరాడిన రిషి నేటి ఉదయం మృతి చెందారు. ఈ మేరకు ఆయన బంధువులు ఓ ప్రకటన చేశారు. చివరి క్షణాల్లో ఆయన ఎలా ఉన్నారో చెప్పుకొస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఉన్న సారాంశం ఏంటంటే..

అందర్నీ ఎంటర్టైన్..

అందర్నీ ఎంటర్టైన్..

'మేము ఎంతో ప్రేమించే రిషి కపూర్ ల్యుకేమియాపై రెండేళ్ల పాటు పోరాడి ఈ ఉదయం 8.45కి మృతి చెందారు. ఎంతో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి శ్వాస వరకు తమను ఎంతో ఎంటర్టైన్ చేశారని ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ చెప్పారు.

రెండేళ్ల పాటు చికిత్స..

రెండేళ్ల పాటు చికిత్స..

రెండు ఖండాల్లో రెండేళ్ల పాటు రిషి చికిత్స పొందారు. చికిత్స సమయంలో కూడా ఆయన ఎంతో సరదాగా ఉన్నారు. తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. కుటుంబం, స్నేహితులు, ఆహారం, సినిమాలు వీటి గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఈ రెండేళ్ల కాలంలో ఆయనను చూసేందుకు వచ్చినవారంతా... క్యాన్సర్‌ను ఎదురించి ఆయన నిలబడ్డ తీరుకు అంతా ఆశ్చర్యపోయేవారు.

చిరు నవ్వుతోనే గుర్తుంచుకోవాలి..

చిరు నవ్వుతోనే గుర్తుంచుకోవాలి..

అభిమానులు చూపించే ప్రేమకు ఆయన ఎంతో సంతోషించేవారు. తన మరణం తర్వాత కూడా అభిమానులందరూ చిరునవ్వుతోనే తనను గుర్తుంచుకోవాలని... కంటతడి పెట్టకూడదని ఆయన కోరుకున్నారు. అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Recommended Video

#RishiKapoor : Celebrities And Politicians Pay Tribute To Rishi Kapoor
 ఎవ్వరూ రావొద్దు..

ఎవ్వరూ రావొద్దు..

ఇది చాలా బాధాకరమైన సమయం. కరోనా నేపథ్యంలో ఎన్నో నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిని గౌరవించాలి. లాక్ డౌన్‌ను అందరూ పాటించాలి.. ఎవ్వరూ కూడా మా కోసం రావొద్దు. ఆయన అభిమానులు, మంచిని కోరుకునేవారు, మిత్రులు, కుటుంబ సభ్యలు అందరూ కూడా చట్టాలను గౌరవించండ'ని కోరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X