Rishi Kapoor Filmography: వెండితెర ప్రేమికుడిగా, రొమాంటిక్ హీరోగా రిషి కపూర్

బాలీవుడ్ నట దిగ్గజం రిషి కపూర్ 1955లో శ్రీ 420 చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తన తండ్రి రాజ్‌కపూర్ రూపొందించిన ప్యార్ హువా ఇక్రార్ హువా అనే పాటలో కనిపించడం ద్వారా నటనలో అక్షరాలు దిద్దుకొన్నారు. ఆ తర్వాత 1970లో మేరా నామ్ జోకర్‌లో బాల రాజ్‌కపూర్‌గా నటించారు. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ బాల నటుడిగా అవార్డును అందుకొన్నారు.

ఇక 1973లో తండ్రి రాజ్‌కపూర్ దర్వకత్వంలో వచ్చిన బాబీతో చిత్రంతో రొమాంటిక్ హీరోగా దేశ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈచిత్రంలో నటనకు గాను ఉత్తమ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కింది.

Rishi Kapoor Filmography: Silverscreen, Romantic Bollywood Hero Rishi Kapoor

అలా మొదలైన రిషి కపూర్ సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి లవర్ బాయ్, రొమాంటిక్ హీరోలకు కొత్త నిర్వచనం పలికించారు. పలువురు హీరోయిన్లతో రిషి వెండితెర కెమిస్ట్రీ ప్రేక్షకులకు, యువతకు గిలిగింతలు పెట్టింది.

1976లో లైలా మజ్నూ, కభీ కభీ
1977లో హమ్ కిసీసే కమ్ నహీ, అమర్ అక్బర్ ఆంథోని
1978లో పతీ పత్ని ఔర్ ఓ, నయాదౌర్
1979లో స్వర్గం
1980లో కర్జ్
1981లో నసీబ్
1982లో ప్రేమ్ రోగ్
1983లో కూలీ
1985లో సాగర్
1986లో నగీనా
1987లో ఖుదా గర్జ్
1989లో చాందినీ
1991లో హీనా
1992లో బోల్ రాధా బోల్, దీవానా
1993లో సాద్నా, దామిని, గురుదేవ్
1993లో ప్రేమ్ రోగ్
1995లో యారానా
2000లో రాజు చాచా
2004లో హమ్ తుమ్
2006లో ఫనా
2008లో హల్లాబోల్
2009లో ఢిల్లీ 6
2012లో అగ్నిపథ్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హౌస్‌ఫుల్ 2, జబ్ తక్ హై జాన్
2013లో డీ డే
2013లో బేషరమ్, శుద్ద్ దేశీ రొమాన్స్
2016లో కపూర్ అండ్ సన్స్
2018లో 102 నాటౌట్, ముల్క్

సుమారు 6 దశాబ్దాల కెరీర్‌లో 150కిపైగా చిత్రాల్లో నటించారు. 2000 సంవత్సరం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X