క్యాన్సర్‌తో అలనాటి టాప్ హీరో.. ఇంటికి తీసుకెళ్లండి ఆవేదన

హిందీ పరిశ్రమకు సంబంధించిన టాప్ హీరోలు, హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడటం బాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. తాజాగా అలనాటి స్టార్ హీరో, ప్రస్తుత యువ హీరో రణ్‌బీర్ కపూర్‌ తండ్రి రిషి కపూర్ కూడా క్యాన్సర్ బారిన పడి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. గత ఎనిమిది నెలలుగా న్యూయార్క్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన తన ఆవేదననను వ్యక్త చేశారు. న్యూయార్క్‌లో ఉండపట్టి ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోయింది. ఎప్పుడెప్పుడూ ఇంటికి వెళ్లాలా అనే ఫీలింగ్‌ వెంటాడుతున్నది అని ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. క్యాన్సర్ బారిన పడటంతో రిషీ కపూర్ గతేడాది సెప్టెంబర్‌లో అమెరికాకు చికిత్స కోసం వెళ్లారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. దాదాపు క్యాన్సర్ వ్యాధి తగ్గినట్టు వైద్యులు ధృవీకరించినట్టు సమాచారం.

రిషికపూర్‌కు ఇంటి బెంగ పట్టుకొన్నది. తన కుమారుడి పెళ్లికి ప్లాన్ కూడా చేస్తున్నారు. ఆయన ఇంటికి ఎప్పుడు బయలుదేరుతారో తెలియదు. కానీ రిషి మనసంతా ఇంటిపైనే ఉంది అని సన్నిహితులు వెల్లడించారు.

Rishi Kapoor: I am cancer-free

అమెరికాలో చికి్త్స పొందుతున్న రిషి కపూర్‌ను షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకోన్, ప్రియాంకా చొప్రా, వికి కౌశల్, అనిల్, టీనా అంబానీ తదితరులు వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించారు. అలాగే కపూర్ ఫ్యామిలీలో సోదరిలు రైమా జైన్, రితూ నంద పరామర్శించారు. అలాగే తన సోదరుడి కుమార్తెలు కరిష్మ కపూర్, కరీనాలు కూడా అమెరికా వెళ్లి వచ్చారు. తన కూతురు రిధిమా కపూర్, కుమారుడు రణ్‌బీర్, ఆయన ప్రేయసి అలియాభట్ వీలు చిక్కితే రిషీ కపూర్ వద్దకు వెళ్లి వస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X