రిషికపూర్ సంతకం చేసిన చివరి మూవీ ఏంటో తెలుసా? సెన్సేషనల్ మూవీ రీమేక్‌లో!

గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్నప్పటికీ రిషి కపూర్ మాత్రం తనకు ఇష్టమైన నటనకు దూరం కాలేదు. ఆరోగ్యం సహకరించినా, సహకరించకపోయినా సినిమాలను మాత్రం వదలకపోవడం ఆయనకు యాక్టింగ్‌పై ఉన్న మక్కువను చెప్పకనే చెబుతుంది. తాజాగా ఇటీవల ఆయన ఓ బాలీవుడ్ సినిమాను చేయడానికి అంగీకరించారని ఎజ్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది.

జనవరి 27న ఎజ్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓ ప్రకటనను వెల్లడిస్తూ.. హాలీవుడ్‌లో రాబర్ట్ డీ నీరో, అన్నా హాత్‌వే నటించిన ది ఇంటర్న్ అనే సినిమాను రీమేక్ చేయడానికి రిషి కపూర్‌ను సంప్రదించాం. ఆయన ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్నారరు. దీపికా పదుకోన్‌తో కలిసి నటించడానికి ఉత్సాహం చూపారు అని తెలిపారు.

Rishi Kapoor in The Intern remake: signed for his last movie with Deepika Padukone

ఇక దీపిక పదుకోన్‌తో కలిసి పని చేసే అవకాశం రావడంపై రిషికపూర్ స్పందిస్తూ.. సమకాలీన పరిస్థితులుకు ది ఇంటర్న్ సినిమా సరిగ్గా సరిపోతుంది. ఈ చిత్రంలో మానవ సంబంధాలు గొప్పగా ఉంటాయి. హృదయానికి హత్తుకొనే కథాంశం ఉన్న చిత్రంలో దీపికాతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. వార్నర్ బ్రదర్స్, ఎజ్యూర్ కలిసి అధికారికంగా ఇండియాలో సినిమాను రూపొందించడానికి ముందుకు రావడం గొప్ప విషయం అని రిషి కపూర్ అన్నారు.

గతంలో రిషి, దీపిక కలిసి ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కల్ చిత్రంలో నటించారు. కానీ వారిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించలేదు. ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందని భావించిన అభిమానులకు రిషి మరణంతో నిరాశే ఎదురైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X