నాకు క్యాన్సర్.. దేవుడి దయ ఉంటే.. బాంబు పేల్చిన బాలీవుడ్ హీరో!

బాలీవుడ్ అలనాటి హీరో, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషికపూర్ క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొద్దికాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై ఆయన మీడియా ముఖంగా స్పందించారు. క్యాన్సర్‌ను ఎదురించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తాను అని రిషికపూర్ ధీమా వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

నాకు క్యాన్సర్ వ్యాధి అని

నాకు క్యాన్సర్ వ్యాధి అని

గత కొద్దిరోజుల క్రితం క్యాన్సర్ వ్యాధికి సంబంధించి లక్షణాలు పరీక్షల్లో బయటపడ్డాయి. ప్రస్తుతం రోగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి అని రిషికపూర్ సోదరుడు రణ్‌ధీర్ కపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిషి కపూర్‌ అమెరికాలో చికిత్స పొందుతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. దాంతో నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అని రిషికపూర్ స్వయంగా స్పందించారు.

అమెరికాలో చికిత్స జరుగుతున్నది

అమెరికాలో చికిత్స జరుగుతున్నది

నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతం అమెరికాలో చికిత్స జరుగుతున్నది. దేవుడి దయతో త్వరలోనే క్యాన్సర్ మహమ్మారి నుంచి విముక్తుడిని అవుతాను. క్యాన్సర్ వ్యాధి చికిత్స చాలా క్రిటికల్‌గా ఉంది. ఈ చికిత్స సమయంలో సహనం ఉండాలి. సహనాన్ని అలవర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను అని రిషీ కపూర్ బాలీవుడ్ పత్రికతో అన్నారు.

 మనసు ప్రశాంతంగా ఉంది

మనసు ప్రశాంతంగా ఉంది

ఇలాంటి పరిస్థితుల్లో నాకు సినిమాలు లేకపోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమాల గురించి ఆలోచించే అవకాశమే లేదు. దాంతో మనసు చాలా ప్రశాంతంగా ఉంది. శాంతియుత వాతావరణం క్యాన్సర్ వ్యాధిపై పోరాడేందుకు నాకు మరింత మనోధైర్యాన్ని ప్రసాదించింది.

రిషి కపూర్ భార్య స్పందన

రిషి కపూర్ భార్య స్పందన

రిషికపూర్ ఆరోగ్యంపై రూమర్లు వస్తుండటంతో ఆయన సతీమణి నీతూకపూర్ కూడా గతంలో స్పందించారు. రిషీ ఆరోగ్యంపై నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కలుషితం కాకుండా చూసుకొంటే క్యాన్సర్ (కర్కాటక రాశి) అనేది ఓ జాతక చిహ్నం మాత్రమే అని నీతూ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X