చనిపోయే నాటికి రిషి కపూర్ సంపద ఎంతో తెలుసా? ఆస్తులు విలువ తెలిస్తే షాకే!
భారతీయ సినీ దిగ్గజం రాజ్‌కపూర్ ఫ్యామిలీ అంటే బాలీవుడ్‌లోని సంపన్న వర్గంలో ఒకటని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజ్ కపూర్ తర్వాత కపూర్ వంశ వారసత్వాన్ని రణధీర్, రిషి, రాజీవ్ కపూర్లు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌పై ఆ భారాన్ని వదిలివేశారు. గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రిషి కపూర్ ఏప్రిల్ 30న మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిషి కపూర్ పేరిట ఎంత ఆస్తి ఉండవచ్చనే విషయంపై చర్చ జరుగుతున్నది. ఆయన ఆస్తుల వివరాలు ఇలా..

అప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు
మరణానికి కొద్ది రోజుల ముందు ఓ టాక్ షోలో రిషి కపూర్ మాట్లాడుతూ.. నాన్న రాజ్‌కపూర్‌కు సినిమాలు, వాటిపై పెట్టుబడి పెట్టడం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. నాకు 21 ఏళ్లు వచ్చే వరకు కూడా సొంత ఇల్లు అంటూ లేదు. కానీ అప్పటికీ ఆర్‌కే స్టూడియో, ఇతర సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన ఆస్తులు దండిగా ఉండేవి. ఆయన సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలే రాలేదు అని రిషి కపూర్ చెప్పారు.

బాబీ మూవీ విజయం తర్వాత
తనను బాబీ చిత్రం ద్వారా హీరోగా బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం చేయడం, ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం రాజ్‌కపూర్‌కు ఊరట నిచ్చింది. ఎందుకంటే బాబీ సినిమాకు ముందు నాన్న తీసిన మేరా నామ్ జోకర్ సినిమాకు విపరీతమైన నష్టాలు రావడంతో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత బాబీ విజయం నష్టాలను పూడ్చటంతోపాటు ఆర్థికంగా సంపన్నంగా మార్చింది. దాంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు నాన్నను ఫోర్స్ చేయడంతో సొంత ఇంటిని కొనుగోలు చేశారు అని రిషి కపూర్ వెల్లడించారు.

కపూర్ వంశానికి నిజమైన వారసుడిగా
బాబీ తర్వాత రిషి కపూర్ కెరీర్ రాకెట్‌లో రివ్వున దూసుకెళ్లింది. వరుస విజయాలు ఖాతాలో పడటంతో రెమ్యునరేషన్ పరంగానే కాకుండా.. స్టార్ హోదా కూడా భారీగా పెరిగింది. పృథ్వీరాజ్ కపూర్, రాజ్‌కపూర్‌కు నిజమైన వారసుడిగా ఎదిగారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ బాలనటుడిగా అవార్డు మేరా నామ్ జోకర్ సినిమాకు వచ్చినప్పుడు.. మా తాతకు కాళ్లకు మొక్కి దీవెనలు తీసుకొంటే.. కపూర్ వంశానికి నీవే నిజమైన వారసుడివి అని దీవించారు అనే విషయాన్ని రిషి కపూర్ వెల్లడించారు.

కపూర్ లెగసీని తీసుకెళ్లేది రణ్‌బీర్‌పైనే
కపూర్ లెగసీని దాదాపు 40 ఏళ్లపాటు రిషికపూర్ తన భుజాలపై మోశాడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. పృథ్వీ, రాజ్ కపూర్ వారసుడిగా ఎంత సక్సెస్ అయ్యాననే ప్రశ్నను వదిలేస్తే.. ఇక ముందు నా కుమారుడు రణ్‌బీర్ కపూర్ దానిని కొనసాగిస్తాడు. మా నాన్న, తాత ఆశయాలను ఎలా నేను ముందుకు తీసుకెళ్లానో..అలానే రణ్‌బీర్ ముందుకెళ్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video

కపూర్ లెగసీని తీసుకెళ్లేది రణ్‌బీర్‌పైనే
కపూర్ లెగసీని దాదాపు 40 ఏళ్లపాటు రిషికపూర్ తన భుజాలపై మోశాడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. పృథ్వీ, రాజ్ కపూర్ వారసుడిగా ఎంత సక్సెస్ అయ్యాననే ప్రశ్నను వదిలేస్తే.. ఇక ముందు నా కుమారుడు రణ్‌బీర్ కపూర్ దానిని కొనసాగిస్తాడు. మా నాన్న, తాత ఆశయాలను ఎలా నేను ముందుకు తీసుకెళ్లానో..అలానే రణ్‌బీర్ ముందుకెళ్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











