twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిషి కపూర్ వివాదాల జోరు.. ఆ గొడవలో సల్మాన్ ఖాన్ ఉన్నా బయపడలేదు?

    |

    బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ సినీ కెరీర్ చాలా విచిత్రంగానే కొనసాగింది. కపూర్స్ వారసత్వాన్ని ఒక యాక్టర్ గా కెరీర్ మొదట్లో బాగానే నిలబెట్టారు. తండ్రి రాజ్ కపూర్ స్థాయిలో కాకపోయినా రొమాంటిక్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ లో ఒకానొక దశలో ఆయన కాంట్రవర్సీలలో ఎక్కువగా నిలిచారు.

    కాంట్రవర్సీ రిషి..

    కాంట్రవర్సీ రిషి..

    సోషల్ మీడియాలో ఎలాంటి విషయంలో అయినా రిషి కపూర్ కలుగజేసుకునే వారు. వివాదాస్పద విషయాలపై తనదైన శైలిలో సెటైర్ వేసే ఆయన కొన్ని వివాదాల్లో డేరింగ్ గా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని ఈవెంట్స్ లలో తారలతో గోడవపడేవారు. మళ్ళీ అది మర్చిపోయేలా వెంటనే గొడవపడిన వారితో కలిసిపోయేవారు.

    సల్మాన్ ఖాన్ గొడవ..

    సల్మాన్ ఖాన్ గొడవ..

    ఒకానొక సందర్భంలో సల్మాన్ ఖాన్.. రిషి కపూర్ ని కొట్టడానికి ట్రై చేశాడని మీడియాలో వార్తలు వచ్చాయి. సోనమ్ కపూర్ పెళ్లిలో సల్మాన్ మరదలు సోహైల్ ఖాన్ తో రిషి కపూర్ తప్పుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్ కలుగజేసుకునే ప్రయత్నంలో అక్కడ పరిస్థితులు చూస్తుండగానే గొడవకు దారి తీశాయట.

     రిషి కపూర్ బయపడలేదు..

    రిషి కపూర్ బయపడలేదు..

    రిషి కపూర్ ఎలాంటి గోడవ చేశాడనేది ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ గొడవలో సల్మాన్ ఖాన్ రాకముందే రిషి కపూర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని కథనాలు వెలువడ్డాయి. ఇక మరికొన్ని రోజులకు సల్మాన్ , రిషి కపూర్ ల మధ్య కొంతసేపు మాటల యుద్ధం జరిగిందని రిషి కపూర్ అప్పుడు భయపడకుండా సల్మాన్ మాటలకు కౌంటర్ ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అనంతరం కుటుంబ సభ్యులు రిషి కపూర్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారని టాక్ వచ్చింది.

    ఎన్నో కాంట్రవర్సీలు..

    ఎన్నో కాంట్రవర్సీలు..

    రిషి కపూర్ జీవితంలో కాంట్రవర్సీలకు కొదవలేదు. ఓ బడా కంపెనీ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే చేతిలో చిప్ప ఒక్కటే సెట్టవుతుందని అలాగే మహారాష్ట్రలో బీఫ్ బ్యాన్ చేయడంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బీఫ్ తింటానని కామెంట్ చేసి ఓ వర్గం వారిని తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించారు.

    Recommended Video

    Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
    సల్మాన్ హిట్ అండ్ రన్ కేస్..

    సల్మాన్ హిట్ అండ్ రన్ కేస్..

    జింకను వేటాడిన కేసులో సల్మాన్ పలుమార్లు జైలుకెళ్లొచ్చిన విషయంపై ఒకసారి రిషి కపూర్ ఎవరు ఊహించని విధంగా స్పందించారు. ఈ విషయంలో కపూర్ ఫ్యామిలీ ఎల్లప్పుడూ ఖాన్ లకు మద్దతుగా ఉంటుందని అన్నారు. అలాగే హీరోయిన్ ఆసిన్ రాహుల్ శర్మ పెళ్లిలో కూడా రిషి కపూర్ ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఒక పెద్ద ఫోకస్ లైట్ పెట్టాలని అక్కడి నిర్వహకులతో గొడవకు దిగి అందరిని షాక్ కి గురి చేశారట. దాదాపు గంట తరువాత అక్కడి నుంచి రిషి కపూర్ వెళ్లడంతో వారి వెడ్డింగ్ హ్యాపీగా జరిగినట్లుగా తెలుస్తోంది

    English summary
    Rishi Kapoor is the go-to person for any matter on social media. There are occasions when he dispenses with his own style on controversial matters, and has acted daringly in some controversies. At some events, the stars get together. They were soon joined by those who clashed to forget it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X