twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చివరి క్షణాల్లో అభిమానితో రిషి కపూర్.. వివాదంగా మారిన వీడియో.. అసలు జరిగిందేమిటంటే

    |

    హస్పిటల్‌లో బెడ్‌పై ఉన్న రిషికపూర్‌తో కలిసి అభిమాని పాట పాడిన వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రిషి కపూర్ చివరి రోజులకు సంబంధించి హాస్పిటల్‌ సంఘటనను ఎలా వీడియోగా తీస్తారు.. వైద్య నియమాలకు ఇది వ్యతిరేకం కాదా అంటూ హెచ్ఎన్ రిలయెన్స్ హాస్పిటల్ వర్గాలను ప్రశ్నించడం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వీడియో గురించి వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Video Of Rishi Kapoor Blessing Doctor Goes Viral | Filmibeat Telugu
    రిషి కపూర్ చివరి క్షణాల్లో

    రిషి కపూర్ చివరి క్షణాల్లో

    ఏప్రిల్ 30వ తేదీన రిషి కపూర్ మరణించిన తర్వాత హాస్పిటల్ బెడ్‌పై రిషికపూర్ చివరి క్షణాలు అంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. రిషికపూర్ బెడ్‌పై ఉంటే ధీరజ్ కుమార్ సాను అనే వ్యక్తి దీవానా చిత్రంలోని తేరే దర్ద్ సే దిల్ ఆదాబ్ రహా అనే పాటను పాడితే.. రిషికపూర్ ఫిదా అయిపోయి గొప్పగా రాణించాలని దీవెనలు అందించారు.

    రిషి ధీరజ్ కుమార్ వీడియోపై అభ్యంతరాలు

    రిషి ధీరజ్ కుమార్ వీడియోపై అభ్యంతరాలు

    రిషి, ధీరజ్ కుమార్ వీడియోపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దర్శకుడు అశోక్ పండిట్ హెచ్ఎన్ హాస్పిటల్ వర్గాలకు లేఖ రాశారు. రిషి కపూర్ లాంటి లెజెండ్ కుటుంబం అనుమతి లేకుండా ఆ వీడియోను ఎలా రిలీజ్ చేస్తారు. ఆయన గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు. గతంలో కూడా వినోద్ ఖన్నాకు సంబంధించిన హాస్పిటల్ వీడియో కూడా ఇలానే లీక్ అయింది. ఇలాంటి తప్పులు పునరావృతం కావడం వైద్య నియమాలకు వ్యతిరేకం అంటూ లేఖలో అశోక్ పండిట్ ఆవేదన వ్యక్తం చేశారు.

    వైద్య నియమాలకు వ్యతిరేకం

    హాస్పిటల్‌లో భద్రత, వైద్య నియామాలకు వ్యతిరేకంగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంపై వెంటనే హాస్పిటల్ వర్గాలు ఎంక్వైరీ వేయాలి అని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ కోరింది. 15 రోజుల్లోగా ఈ లోపాలపై వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సెలెబ్రిటీలు, లెజెండ్ ప్రతిష్టను మసకబారే ప్రయత్నాలను అడ్డుకోవాలని లేఖలో ఘాటుగా స్పందించారు.

    అది ఫేక్ వీడియో అంటూ

    అది ఫేక్ వీడియో అంటూ


    అయితే రిషికపూర్, ధీరజ్ కపూర్ వీడియో గురించి యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ స్పందించింది. ఆ వీడియో ఫేక్ వీడియో, అది రిషి కపూర్ మరణానికి ముందు కాదు. గతంలో ఎప్పుడో తీసి ప్రస్తుతం యూట్యూబ్‌లో షేర్ చేశారు. రిషి కపూర్ మరణం నేపథ్యంలో అది వైరల్ కావడంతో అనవసరపు వివాదాలకు తావిచ్చింది అని చెప్పారు. ఆ వీడియో గత ఫిబ్రవరిలో రిషి హాస్పిటల్‌లో చేరినప్పటిది అని పేర్కొన్నారు.

    ధీరజ్ కుమార్ వీడియోపై వివరణ

    అయితే రిషికపూర్‌తో పాట పాడిన ధీరజ్ కుమార్ ఈ వివాదంపై స్పందించారు. ఆ వీడియో ఫిబ్రవరిలో రిషికపూర్ హాస్పిటల్‌లో చేరినప్పటిది. ఆ సమయంలో తాను రిషి కపూర్‌ను కలిశాను. ఆ సమయంలో తాను అభిమానిని అని చెప్పి.. నా గురించి చెబితే పాట పాడమని అడిగారు. దాంతో నేను పాట పడాను. అందుకు సంతోషించిన ఆయన కష్టపడి పైకి రావాలని దీవెనలు అందించారు. వాస్తవానికి నేను గాయకుడు కుమార్ సాను అభిమానిని. అందుకే తన పేరు ధీరజ్ కుమార్ పక్కన సాను అని చేర్చుకొన్నానని చెప్పారు.

    English summary
    Rishi Kapoor with fan Song video goes contraversy: Indian Film and Television Directors' Association tweeted that .. fwice_mum raises protest over viral video of #RishiKapoor ji in ICU at HN hospital.The video is unethical -without permission &violates fundamental right to live with dignity-privacy of a legend who lived a glorious & dignified life& loved ,regarded , held in high esteem by all.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X